Project K మోడ్రన్ విష్ణువు అవతారం.. కీలక విషయాలు చెప్పేసిన నిర్మాత అశ్వనీ దత్

తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థలో ఒకటిగా నిలిచింది వైజయంతీ మూవీస్. 1972లో స్థాపించిన ఈ నిర్మాణ సంస్థకు అధిపతి అశ్వనీ దత్ చలసాని అని తెలిసిన విషయమే. ఇటీవల కాలంలో అశ్వనీ దత్ తో పాటు ఆయన కుమార్తె స్వప్న దత్ కూడా నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. ఈ బ్యానర్ నుంచి అనేక సినిమాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మోత మోగించాయి.

జగదేక వీరుడు అతిలోక సుందరి, రాజకుమారుడు, స్టూడెంట్ నెంబర్ 1, ఇంద్ర, దేవదాస్, మహానటి, సీతా రామం వంటి బ్లాక్ బస్టర్స్ అందించింది. తాజాగా ప్రభాస్ తో ప్రాజెక్ట్ కె సినిమాతో రాబోతున్న నిర్మాత అశ్వనీ దత్ ఆ సినిమాకు సంబంధించిన కీలక విషయాలు చెప్పేశారు.

క్లాసిక్ హిట్స్ అందుకుని..

క్లాసిక్ హిట్స్ అందుకుని..

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీల్లో పాన్ ఇండియా హవా నడుస్తోన్న విషయం తెలిసిందే. తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రాల్లో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె ఒకటి. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

అందుకు తగినట్లుగానే అత్యంత భారీ బడ్జెట్, క్యాస్టింగ్ తో సినిమాను నిర్మిస్తోంది వైజయంతీ మూవీస్. మహానటి, సీతా రామం వంటి క్లాసిక్ హిట్స్ అందుకున్న వైజయంతీ మూవీస్ రూపొందిస్తున్న ప్రాజెక్ట్ కె అప్డేట్స్, పోస్టర్స్ ఎంతో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు.

జనవరి 12న..

జనవరి 12న..

ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ మైండ్ బ్లోయింగ్ లా ఉంది. అందులో ఎడారి వంటి ప్రదేశంలో ఒక పెద్ద అర చేతి ఉంది. కానీ దాని శరీరం మాత్రం కనిపించదు.

ఆ పెద్ద అర చేతి ముందు ముగ్గురు గన్స్ పట్టుకుని ఉండటం.. ప్రపంచం ఎదురు చూస్తోంది అనే అర్థం వచ్చేలా ఇచ్చిన క్యాప్షన్ అదిరిపోయింది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న వచ్చే ఏడాది అంటే 2024న విడుదల చేయనున్నారు.

తండ్రీకొడుకులుగా..

తండ్రీకొడుకులుగా..

ఇక ప్రభాస్ ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా వస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణెతోపాటు దిశా పటానీ కూడా అలరించనుంది. సుమారు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కెలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ప్రభాస్ కు తండ్రిగా బిగ్ బీ కనిపిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అమితాబ్ బచ్చన్ తోపాటు మిగతా పాత్రలు కూడా ఇంతకుముందు ఎప్పుడు కనిపించని విధంగా భిన్నమైన గెటప్పుల్లో కనిపించబోతున్నట్లు టాక్.

అతనే పర్ఫెక్ట్ అని..

అతనే పర్ఫెక్ట్ అని..

అతి పెద్ద తారాగణంతో వస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాలో మరో కీలక పాత్రలో సీతా రామం హీరో దుల్కర్ కూడా నటిస్తున్నట్లు తెలిసింది. కెమియో రోల్ చేస్తున్న దుల్కర్ సల్మాన్ ఆ పాత్రకు పర్ఫెక్ట్ అని అశ్వనీ దత్ భావించారట. ఆ పాత్ర అనుకున్నప్పుడు దుల్కర్ మాత్రమే ఆయన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. అయితే మొదట్లో మిక్కీ జే మేయర్ సంగీత దర్శకుడు అని ప్రకటించిన మేకర్స్ తాజాగా అతను కాదని, బీజీఎమ్ తో పాటు సంగీతం కోసం సంతోష్ నారాయణ్ తోపాటు బాలీవుడ్ లేడీ మ్యూజిక్ దర్శకురాలని తీసుకున్నట్లు ఇటీవల అశ్వనీ దత్ వెల్లడించారు.

వచ్చే ఏడాది అంతా..

వచ్చే ఏడాది అంతా..

ప్రాజెక్ట్ కె సినిమా మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందే సూపర్ మూవీ అని గతకొద్దిరోజులగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ విషయాలపై అశ్వనీ దత్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "ప్రాజెక్ట్ కె గ్రాఫిక్స్ తో కూడుకున్నది. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి కాగా వీఎఫ్ఎక్స్ కి చాలా సమయం పడుతుంది. వచ్చే ఏడాది అంతా గ్రాఫిక్స్ పై వర్క్ జరుగుతుంది" అని ఆయన చెప్పారు.

ఆశ్చర్యపరుస్తుంది..

ఆశ్చర్యపరుస్తుంది..

ప్రాజెక్ట్ కె సినిమా జోనర్ గురించి కూడా అశ్వనీ దత్ తెలిపారు. "ఈ చిత్రంలో ఫాంటసీ అండ్ సైన్స్ ఫిక్షన్ అంశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది విష్ణువు మోడ్రన్ అవతారం గురించి ఉంటుంది. అలాగే ఈ చిత్రంలో సెంటిమెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ లను పర్యవేక్షించేందుకు నలుగురు ఐదుగురు ఇంటర్నేషనల్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ లను కూడా తీసుకొచ్చాం. సినిమాలో మీరు చూసే ప్రతి అంశం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది" అని అశ్వనీ దత్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X