Project K మ్యూజిక్ డైరెక్టర్ మార్పు.. ప్రభాస్ కంటే ఎఫెక్టివ్ గా ఆ పాత్రలు.. నిర్మాత కామెంట్స్

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీల్లో పాన్ ఇండియా హవా నడుస్తోంది. తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రాల్లో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె ఒకటి. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే అత్యంత భారీ బడ్జెట్, క్యాస్టింగ్ తో సినిమాను నిర్మిస్తోంది వైజయంతీ మూవీస్. మహానటి, సీతా రామం వంటి క్లాసిక్ హిట్స్ అందుకున్న వైజయంతీ మూవీస్ రూపొందిస్తున్న ప్రాజెక్ట్ కె అప్డేట్స్, పోస్టర్స్ ఎంతో క్యూరియాసిటీ నెలకొల్పాయి. తాజాగా ఈ సినిమాలో ముందుగా అనుకున్న మిక్కీ జే మేయర్ ను తొలగిస్తున్నట్లు చెప్పడంతో పాటు తదితర ఆసక్తికర విషయాలను పంచుకున్నారు నిర్మాత అశ్వనీదత్.

భారీ అంచనాలు..

భారీ అంచనాలు..

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారాడు. అప్పటి నుంచి భారీ బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తూ మరింత క్రేజ్ పెంచుకుంటున్నాడు. ఇలా ఇప్పటికే ప్రభాస్ చేతిలో 6 సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ప్రాజెక్ట్ కె'. ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొనగా, మూవీ నుంచి వస్తున్న ఒక్కొక్క అప్డేట్ క్యూరియాసిటీని అమాంతం పెంచేస్తోంది.

సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో..

సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో..

ఇటీవలే ప్రాజెక్ట్ కె విడుదల తేదిని ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ మైండ్ బ్లోయింగ్ లా ఉంది. అందులో ఎడారి వంటి ప్రదేశంలో ఒక పెద్ద అర చేతి ఉంది. కానీ దాని బాడి మాత్రం కనిపించదు. ఆ పెద్ద అర చేతి ముందు ముగ్గురు గన్స్ పట్టుకుని ఉండటం.. వరల్డ్ ఈజ్ వెయిటింగ్ అనే క్యాప్షన్ అదిరిపోయింది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న వచ్చే ఏడాది అంటే 2024న విడుదల చేయనున్నారు.

కొత్త ప్రయోగం..

కొత్త ప్రయోగం..


ఇక ప్రభాస్ ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా వస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణెతోపాటు దిశా పటానీ కూడా అలరించనుంది. సుమారు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కెలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలా భారీ తారాగణంలో ప్రభాస్ ను హీరోగా పెట్టి నాగ్ అశ్విన్ ఓ కొత్త ప్రయోగం చేయబోతున్నట్లు అర్థం అవుతోంది. ఇటీవలే ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కెమియో చేయనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

 బాలీవుడ్ లేడీ మ్యూజిక్ డైరెక్టర్..

బాలీవుడ్ లేడీ మ్యూజిక్ డైరెక్టర్..


తాజాగా ప్రాజెక్ట్ కె సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నిర్మాత అశ్వనీదత్. "ప్రాజెక్ట్ కె సినిమాకు మిక్రీ జే మేయర్ సంగీతం అందించడం లేదు. బీజీఎమ్ తోపాటు సంగీతాన్ని స్కోర్ చేసేందుకు మేము సంతోష్ నారాయణ్ ని తీసుకున్నాం. అంతేకాకుండా ఈ సినిమా సంగీతం కోసం బాలీవుడ్ లేడీ మ్యూజిక్ డైరెక్టర్ ను కూడా సెలెక్ట్ చేశాం. ఈ సినిమాలోని నటీనటుల గురించి త్వరలో అధికారికంగా ప్రకటిస్తాం" అని ఆయన పేర్కొన్నారు.

మూడు ముఖ్యమైనవి..

మూడు ముఖ్యమైనవి..

"ప్రాజెక్ట్ కె షూటింగ్ 70 శాతం పూర్తయింది. మేము 5 నెలల క్రితం వీఎఫ్ఎక్స్, కంపెనీలలో గ్రాఫిక్స్ పని ప్రారంభించాం. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె త్వరలో షూటింగ్ లో పాల్గొంటారు. వారికి కేవలం 7 నుంచి 10 రోజుల షూటింగ్ మాత్రమే ఉంటంది. ప్రాజెక్ట్ కెలో ప్రభాస్ హీరో అయినా.. అమితాబ్, దీపికా పాత్రలు ఈ సినిమాను మరింత ముందుకు తీసుకెళ్తాయి. ఈ మూడు క్యారెక్టర్లు చాలా ముఖ్యమైనవి" అని అశ్వనీదత్ తెలిపారు.

తండ్రీకొడుకులుగా..

తండ్రీకొడుకులుగా..

ఇదిలా ఉంటే ప్రాజెక్ట్ కె చిత్రంలో ప్రభాస్ కు తండ్రిగా అమితాబ్ బచ్చన్ నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అమితాబ్ బచ్చన్ తోపాటు మిగతా పాత్రలు కూడా ఇంతకుముందు ఎప్పుడు కనిపించని విధంగా భిన్నమైన గెటప్పుల్లో కనిపించబోతున్నట్లు అశ్వనీదత్ వెల్లడించారు. ఈ సినిమాపై నిర్మాత చాలా నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ సినిమాలను మించి ప్రాజెక్ట్ కె ఉంటుందని ఇంతకుముందు అశ్వనీదత్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X