Chandrababu Arrest: నన్ను చంపేయండి.. అరెస్ట్ చేయండి.. భోరుమన్న బండ్ల గణేష్

నటుడిగానే కాకుండా ప్రొడ్యూసర్ గా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న బండ్ల గణేష్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా ఆయన అంటే చాలా మందికి ఇష్టం. అలాగే ఆయన పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. ముఖ్యంగా పవనిజమ్ గురించి ఆయన చెప్పే మాటలు వినేందుకు లక్షలాది మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.

ఓవైపు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, మరోవైపు బండ్లన్న ఫ్యాన్స్.. ఈయన మాట్లాడే మాటలను తెగ వైరల్ చేస్తుంటారు. అయితే తాజాగా ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు. స్టేజీపై ఉండగానే భోరుమని విలపించారు. ఆయన ఏడుపు, మాట్లాడే మాటలు విన్న అభిమానులు కూడా కంటతడి పెట్టుకున్నారు.

Producer Bandla Ganesh Emotional Comments on Chandrababu Arrest

అసలేం జరిగిందంటే..?: హైదరాబాద్ సైబర్ టవర్స్ రజతోత్సవం సందర్భంగా చంద్రబాబు గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ గచ్చిబౌలి స్టేడియంలో ఓ వేడుక నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. అలాగే నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఈక్రమంలోనే ఇక్కడకు వచ్చిన ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ మాట్లాడుతూ చాలానే ఆసక్తికర కామెంట్లు చేశారు. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టుపై స్పందించి అందరినీ ఆశ్చర్య పరిచారు. తాను ఇటీవల ఏ ఒక్క పండుగ చేసుకోలేదని చెప్పారు. వినాయక చవితి, బతుకమ్మ, దసరా ఇలా ఏ పండగను కూడా నిర్వహించుకోలేదని వెల్లడించారు.

అయితే ఆ దేవుడి దయ వల్ల దీపావళి పండుగ అయినా సరే చేసుకోవాలనుకుంటున్నట్లు బండ్ల గణేష్ వివరించారు. ఆలోపు అరెస్టు అయి జైల్లో ఉన్న చంద్రబాబు బయటకు వస్తే పండుగను చాలా గ్రాండ్ గా చేసుకుంటానని చెప్పుకొచ్చారు. అలాగే చంద్రబాబు అంటే పేరు కాదని ఓ బ్రాండ్ అని తెలిపాడు. బ్రాండ్ కూడా కాదు.. ఆయన ఓ దేవుడు అని వివరించారు.

Producer Bandla Ganesh Emotional Comments on Chandrababu Arrest

చంద్రబాబును దేవుడు అని అనడానికి గల కారణాలను కూడా వెల్లడించారు. పాలు అమ్మి జీవనం చేసుకునే వారి పిల్లలు సాఫ్ట్ వేర్ లు అయ్యి అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్లడానికి చంద్రబాబుయే కారణం అని చెప్పుకొచ్చారు. తమ గ్రామంలోని చాలా మంది విద్యార్థులు సాఫ్ట్ వేర్ లు అయ్యారని తెలిసినప్పుడు తనకు చాలా సంతోషంగా అనిపించిందని బండ్లన్న పేర్కొన్నారు.

78 ఏళ్ల సంవత్సరాలు కల్గిన తన తండ్రి చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేశారని తనను అడుగుతూ చాలా బాధ పడ్డాడని బండ్ల గణేష్ తెలిపారు. చార్మినార్ కట్టిన కులీ కుతూబ్ షా పేరును ఇప్పటికీ చెప్పుకుంటున్నారని.. కానీ సైబర్ టవర్స్ కట్టిన చంద్రబాబును మాత్రం అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు పేరును 400 కాదు... నాలుగు వేల ఏళ్ల పాటు గుర్తుంచుకుంటారని.. శ్రీకృష్ణుడి జన్మస్థలం అయిన కారాగారంలోనే కదా నాన్నా.. పెట్టింది, ఏ పర్లేదు అని చెప్పినట్లు వివరించారు. జైల్లో ఉన్న శ్రీకృష్ణుడు, అరణ్యవాసానికి వెళ్లిన శ్రీరాముడు దేవుళ్లు కాకుండా పోయారా.. అలాగే చంద్రబాబు కూడా జైలుకు వెళ్లి వస్తే దేవుడు కాకుండా పోతాడా అని అన్నారు.

Producer Bandla Ganesh Emotional Comments on Chandrababu Arrest

అమెరికాలో, తెలంగాణలో, హైదరాబాద్ లో, ఆస్ట్రేలియాలో.. ఇలా అన్ని చోట్ల చంద్రబాబు జై అంటే.. రాజమండ్రిలో మాత్రం చంద్రబాబు జైల్లో ఉండడం తనకు చాలా బాధ కల్గిస్తోందంటూ భోరుమని విలపించారు. ఏడుస్తూనే చాలా సేపు మాట్లాడారు. మనందరికీ భవిష్యత్తు ఇచ్చినందుకు ఆయనను అరెస్ట్ చేశారు.. నన్ను చంపేసి అయినా సరే ఆయనను విడుదల చేయాలని కోరారు.

తనను జైల్లో పెట్ట అయినా సరే చంద్రబాబును బయటకు తీసుకురావాలని చెప్పారు. తాను చనిపోయినా, జైల్లో ఉన్నా కేవలం తన కుటుంబానికి మాత్రమే నష్టం అని.. కానీ చంద్రబాబు లాంటి నాయకుడు రాష్ట్రానికి, దేశానికి చాలా అవసరం అని చెప్పారు. ఆయన చేసిన ఈ కామెంట్లు విన్న చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. నెట్టింట కూడా ఈ వీడియో వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X