శ్రీను వైట్ల కాపీ కొట్టి 100 కోట్లు సంపాదించాడు.. మహేశ్ బాబు సినిమాపై బండ్ల అలాంటి కామెంట్స్
టాలీవుడ్ నటుడు, నిర్మాత, పొలిటిషియన్ బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లో కామెడీ పాత్రలు, సపోర్టింగ్ రోల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మరోవైపు తన ప్రసంగాలతోనూ భారీ పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తుతూ, పొటిలికల్ ఇంటర్వ్యూల్లోనూ ముక్కుసూటిగా మాట్లాడుతూ అందరి అటెన్షన్ ను డ్రా చేశారు. ఇక ఆయన తాజా ప్రసంగం మరోసారి హాట్ టాపిక్ గ్గా మారింది. ఏకంగా సక్సెస్ ఫుల్ టాలీవుడ్ డైరెక్టర్ శ్రీను వైట్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
ఎస్వీ కృష్ణా రెడ్డి సినిమాలు..
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉత్తమ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు ఎస్వీ కృష్ణా రెడ్డి. తన మంచి మనస్సుతో పాటు తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమాలను అందించి ఇండస్ట్రీలో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. 1986 నుంచి ఇప్పటి వరకు ఇంకా సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే ఉన్నారు. ఆయన 32 ఏళ్ల కెరీయర్ లో 42 సినిమాలు తీశారు. చాలా అద్భుతమైన చిత్రాలను అందించాడు. లవ్ తో పాటు, కామెడీని పంచి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి పోయాడు. రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, యమలీలా, శుభ లగ్నం, వినోదం, ఎగిరే పావురమా, ఆహ్వానం, ఊయల, పెళ్లాం ఊరేళితే, హంగామా, చివరగా ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఎస్వీ కృష్ణా రెడ్డి జన్మదిన వేడుకల్లో బండ్ల గణేష్..
టాలీవుడ్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎస్వీ కృష్ణా రెడ్డి జన్మదిన వేడుకులను జూన్ 1 ఘనంగా నిర్వహించారు. ఆయన 1961లో ఈస్ట్ గోదావరి జిల్లాలోని కొంకుడూరు గ్రామంలో జన్మించారు. 1986 నుంచి చిత్ర పరిశ్రమలో సేవలు అందిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఆయన 64వ ఏట అడుగు పెట్టడంతో ఆయన సన్నిహితులు, సినిమా ప్రముఖులు ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్బంగా మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, శ్రీకాంత్, బండ్ల గణేష్ తదిరుతరులు హాజరయ్యారు. ఈ క్రమంలో బండ్ల గణేష్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
బండ్ల గణేష్ కామెంట్స్..
బండ్ల గణేష్ తన ప్రసంగంలో ఎస్వీ కృష్ణా రెడ్డి గురించి మాట్లాడుతూ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తారు. కృష్ణారెడ్డి అవకాశం ఇవ్వడంతోనే వినోదం అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినట్టు చెప్పుకొచ్చారు. అలాగే కృష్ణా రెడ్డి గారి వినోదం చిత్రం కథలన కాపీ కొట్టి శ్రీనువైట్ల లాంటి డైరెక్టర్ 100 కోట్లు సంపాదించుకున్నారని వ్యాఖ్యానించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
శ్రీనువైట్ల - మహేశ్ బాబు సినిమా గురించేనా..
బండ్ల గణేష్ శ్రీనువైట్ల గురించి మాట్లాడటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా మారింది. అయితే శ్రీను వైట్ల కాపీ కొట్టి తీసిన సినిమాలో హీరో హీరోయిన్ ఇంటికి వెళ్లి మామతో నవ్వులు పూయిస్తూనే మరోవైపు ఇంటికి అల్లుడు అవుతాడని చెప్పారు. ఇక మహేశ్ బాబు - శ్రీనువైట్ల కాంబోలో వచ్చిన దూకుడు చిత్రం కూడా ఆయన చెప్పినట్టుగానే ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా బండ్ల గణేష్ శ్రీనువైట్లను అలా అనడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











