అల్లు అరవింద్‌పై బండ్ల షాకింగ్ కామెంట్స్.. యువ నిర్మాత ఫైర్
టాలీవుడ్ చిన్న బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన లేటెస్ట్ మూవీ లిటిల్ హార్ట్స్. ఈ చిత్రాన్ని 90's మిడిల్ క్లాస్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హసన్ నిర్మాతగా రూపొందించారు. ఈ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ లో రూపుదిద్దుకుంది. డెబ్యూ డైరెక్టర్ సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు. 90's మిడిల్ క్లాస్ సిరీస్ ఫేమ్ మౌలి తనుజ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫేమ్ శివానీ నాగారం హీరో హీరోయిన్లుగా నటించారు. సెప్టెంబర్ 5న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
అయితే, లిటిల్ హార్ట్స్ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు, వంశీ నందిపాటి సినిమా డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను చూశారు. కాగా సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం.. 500% వరకు లాభాన్ని అందుకోవడంతో సినిమా టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది. దీంతో లిటిల్ హార్ట్స్ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించారు. ఈ క్రమంలో నిర్వహించిన రీసెంట్ ఈవెంట్ లో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్, నిర్మాత ధీరజ్ మొగిలినేని హాజరయ్యారు.

కానీ ఈవెంట్ లో బండ్ల గణేష్ మాట్లాడుతూ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. 'ఈ సినిమాను తీయడం కాదు, ఈ వజ్రం లాంటి సినిమాను గుర్తించిన నిర్మాతలు బన్నీ వాసు, నందిపాటి వంశీలను పూర్తిగా అభినందిస్తున్నాను. కానీ మీరు ఇంతలా కష్టపడి చివరికి అరవింద్ గారి సినిమా అంటున్నారు. అది ఆయన అదృష్టం.. మీ బ్యాడ్ లక్. ఇంతకంటే ఎక్కువగా నేనేమీ చెప్పలేను. ఆయన ఏమీ చేయరు. లాస్ట్ మినిట్ లో వచ్చి క్రెడిట్ మాత్రం కొట్టేస్తారు. ఆయన జాతకం అట్లాంది మనం ఏమీ చేయలేం..' అంటూ నవ్వుతూనే షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆ వెంటనే మరో యువ నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. బండ్ల గణేష్ గారు ఈవెంట్ నుంచి వెళ్లిపోయారు. ఆయన ముందే ఈ విషయం చెప్పాలని అనుకున్నాను. అల్లు అరవింద్ గారు ఊరికనే వచ్చి క్రెడిట్ అంతా కొట్టేస్తారని బండ్ల గణేష్ అన్నారు. కానీ అది అవాస్తవం. చాలా తప్పు కూడానూ. నా వయస్సుకు డబల్ వయస్సు ఉందాయనది. నేను కష్టపడే దానికి డబల్ కష్టపడుతారాయన.
ఆయన లేకపోతే మేం లేము. మాకున్న టాలెంట్, మాకున్న అవగాహన, సినిమాలపై జడ్జిమెంట్ ఈరోజు ఇక్కడి వరకు తీసుకొచ్చి నిలబెట్టిందే అరవింద్ గారు. మాలాంటి వాళ్లందరికీ అరవింద్ గారు గాడ్ ఫాదర్. అంత ఈజీగా ఆ స్టేజ్, స్టేటస్, పొజిషన్ కు ఎవరు రాలేరు. రారు కూడా. వన్ అండ్ ఓన్లీ అరవింద్ గారెకే కుదురుతుందంటూ బండ్ల గణేష్ కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక లిటిల్ హార్ట్స్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంటోంది. 14 రోజుల్లో రూ.33 కోట్ల గ్రాస్ ను వసూల్ చేయడం విశేషం.


Click it and Unblock the Notifications











