బండ్ల గణేష్‌కు కరోనావైరస్.. ప్రముఖ హాస్పిటల్‌కు తరలింపు

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తాజాగా నిర్వహించిన వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో తేలింది. దాంతో ఆయన కుటుంబ సభ్యులు, ఇతరులను క్వారంటైన్‌కు తరలించే ప్రయత్నాలను అధికారులు చేపట్టారు. కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో కరోనావైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.

Recommended Video

Bandla Ganesh కు Coronavirus పాజిటివ్..టెన్షన్ లో Tollywood!
కుటుంబ సభ్యులకు పరీక్షలు

కుటుంబ సభ్యులకు పరీక్షలు

బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్ అని తేలిన నేపథ్యంలో కుటుంబ సభ్యులందరికీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించారు. అయితే వారికి సంబంధించిన టెస్టుల ఫలితాలు ఇంకా రాలేదని తెలిసింది. శనివారం రోజున ఆ ఫలితాలు వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని కుటుంబ సభ్యులు తెలిపారు.

జూబ్లీహిల్స్ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం

జూబ్లీహిల్స్ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం

ఇక బండ్ల గణేష్ జూబ్లీహిల్స్‌ ఫిలింనగర్‌లోని రామానాయుడు స్టూడియోకు సమీపంలో ఉన్న కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇదే గేటేడ్ కమ్యూనిటీలోనే హీరో నాగశౌర్య, ఇతర సినీ కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి తన సొంత ఊరు షాద్ నగర్‌కు పౌల్ట్రీ వ్యాపార పనుల కోసం వెళ్లి వస్తుంటారు.

హెయిర్ ప్లాంటేషన్‌కు వెళ్లి..

హెయిర్ ప్లాంటేషన్‌కు వెళ్లి..


బండ్ల గణేష్‌ ఇటీవల హెయిర్ ప్లాంటేషన్‌కు వెళ్లారనే, ఆ క్రమంలోనే ఆయన కరోనా బారిన పడి ఉంటారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో ఆయనతో తిరిగిన ప్రముఖులు కూడా గుట్టుచప్పుడు కాకుండా టెస్టులు చేయించుకొంటున్నట్టు తెలుస్తున్నది.

టాలీవుడ్‌లో ప్రకంపనాలు

టాలీవుడ్‌లో ప్రకంపనాలు


బండ్ల గణేష్‌కు కరోనావైరస్ అనే విషయం బయటపడగానే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రకంపనాలు మొదలయ్యాయి. ఇటీవల ఆయనను ఎవరు కలిశారు? ఆయన‌తో ఎవరు భేటి అయ్యారు అనే కోణంలో అదికారులు డేటా సేకరించే ప్రయత్నం చేశారు.

ప్రముఖ హాస్పిటల్‌లో

ప్రముఖ హాస్పిటల్‌లో


బండ్ల గణేష్ కరోనా అనే విషయం తెలియగానే ఇంటి సభ్యులు, బంధువులను అప్రమత్తం చేశారు. ఆయనను క్వారంటైన్‌కు తరలించి ప్రముఖ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X