పవన్, అల్లు అర్జున్‌లని బన్నీవాసు మేనేజ్ చేశారు.. ఆయ్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
అల్లు - మెగా ఫ్యామిలీల మధ్య ప్రస్తుతం కోల్డ్‌వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. కారణాలు ఏవైనా, ఎవరైనా సరే గతంలో మాదిరిగా మెగా కాంపౌండ్ ఒక్కటిగా లేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అన్ని వేళ్లూ ఒక వైపు చూపెడుతున్నాయి. ఆయనే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. బన్నీ చేతలు, మాటలు , వ్యవహారశైలి ప్రస్తుతం వివాదాస్పదమవుతున్నాయి. అల్లు అర్జున్ మాటలు కాంట్రవర్సీ అవుతున్నాయో, లేక కాంట్రవర్సీ అవ్వాలని ఆయన మాట్లాడుతున్నారేమో గానీ ఆయన మైక్ అంటే చాలు మెగా, అల్లు అభిమానులు అలర్ట్ అయిపోతున్నారు.
మెగా - అల్లు ఫ్యామిలీల మధ్య చెప్పను బ్రదర్ ఇన్సిడెంట్ నుంచి గ్యాప్ రావడం మొదలైందంటారు. ఏపీ ఎన్నికల నాటికి ఇది తారాస్థాయికి చేరిందని అందుకే అల్లు అర్జున్.. మేనమామ పవన్ కళ్యాణ్ వైపు కాకుండా ఆయనకు శత్రు శిబిరం వైపు స్నేహ హస్తం చాచారని ఫిలింనగర్ టాక్. ఉద్దేశ్యపూర్వకంగా మెగా ఫ్యామిలీని రెచ్చగొట్టాలనే బన్నీ నంద్యాలలో వైసీపీ నేత శిల్పా రవి ఇంటికి వెళ్లారని మెగా ఫ్యాన్స్ నేటికీ ఫైర్ అవుతున్నారు. ఎన్నికలు ముగిసి, పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా పగ్గాలు అందుకున్నా నేటికీ ఈ గొడవలు సద్దుమణగడం లేదు.

రెండు కుటుంబాల మధ్య పరిస్ధితులు కుదుటపడతాయని అనుకుంటుండగా ఏదో ఒక వివాదం రేగుతూనే ఉంది. నిన్న గాక మొన్న మారుతీనగర్ సుబ్రమణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ వ్యాఖ్యలు .. మానిన గాయాన్ని మళ్లీ కెలికిన చందంగా ఉన్నాయి. మనసుకు ఇష్టమైన వారికి మన సపోర్ట్‌ను చూపించాలి, నాకు ఇష్టమైతే వస్తా, నా మనసుకు నచ్చితే వస్తా అంటూ వ్యాఖ్యానించారు. మెగా ఫ్యామిలీని ఉద్దేశించే అల్లు అర్జున్ ఇన్‌డైరెక్ట్‌గా చేశారంటూ మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు.
ఈ క్రమంలో రెండు ఫ్యామిలీలతో అత్యంత సన్నిహితంగా ఉండే నిర్మాత బన్నీ వాసు కొద్దిరోజుల క్రితం కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యామిలీ అన్నాక కొన్ని అనుకోని పరిస్ధితులు వస్తాయన్నారు. మెగా ఫ్యామిలీని, అందులోని వ్యక్తులను 20 ఏళ్లుగా తాను చూస్తూనే ఉన్నానని బన్నీ వాసు తెలిపారు. కుటుంబంలోని వ్యక్తులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని, ఇదంతా తాత్కాలికమేనని .. ఒక్క సిచ్యూవేషన్ చాలు. తాను కూడా ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నానని బన్నీ వాసు ఆకాంక్షించారు.
తాజాగా మరోసారి మెగా - అల్లు ఫ్యామిలీల అంశంలోకి బన్నీ వాసు వచ్చారు. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నే , నయన్ సారిక నటించిన ఆయ్ మూవీ సక్సెస్‌మీట్‌లో భాగంగా డైరెక్టర్ అంజి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో బన్నీ వాసుపై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. ఆయన మంచి వ్యక్తని అటు పక్క పవన్ కళ్యాణ్, ఇటుపక్క అల్లు అర్జున్‌ని మేనేజ్ చేస్తారని వ్యాఖ్యానించారు.
ఆ సమయంలో స్టేజ్‌పై ఉన్న బన్నీ వాసు .. ఆ మాటలకు ఉలిక్కిపడి అంజీ వద్దు పరిగెత్తుకొచ్చి మైక్ కట్ చేయాలంటూ సిగ్నల్ ఇస్తారు. అది లైవ్ కాదంటూ పక్కనే ఉన్న యాంకర్, నటీనటులు చెప్పడంతో బన్నీ వాసు పక్కకి జరుగుతారు. అయితే వెంటనే స్పీచ్‌ను ముగించాలని బన్నీ వాసు సైగలు ఇవ్వడంతో అంజీ చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు చెప్పి కన్‌క్లూజ్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











