అల్లు ఫ్యామిలీకి ద్రోహం.. ఏ ఒక్కడిని వదలను .. మెగా ప్రొడ్యూసర్ మాస్ వార్నింగ్
బన్నీ వాసు.. తెలుగు సినిమా సర్కిల్స్‌లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు , అల్లు ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అయిన బన్నీ వాసు .. గీతా ఆర్ట్స్‌లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే జీఏ2 పిక్చర్స్ బ్యానర్ ద్వారా బన్నీ వాసుని అల్లు అరవింద్ నిర్మాతగా చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో యాక్టీవ్‌గా ఉండే బన్నీ వాసుని .. పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించారు పవన్.
ప్రజారాజ్యం పార్టీ సమయంలో పనిచేయడంతో పాటు పొలిటికల్ అడ్వర్టైజింగ్‌లో అనుభవం, మంచి పీఆర్ బలం ఉండటంతో ఈ పదవిని బన్నీవాసుకు కట్టబెట్టారు పవన్ కళ్యాణ్. తనపై జనసేనాని పెట్టుకున్న నమ్మకాన్ని వొమ్ము చేయకుండా బాగానే కష్టపడ్డారు బన్నీ వాసు. ఎన్నికల్లో పాలకొల్లు , పిఠాపురం లేదా ఉభయ గోదావరి జిల్లాల్లోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని బన్నీ వాసు భావించారు. తీరా టికెట్ల కేటాయింపులకు వచ్చే సరికి ఆయనకు నిరాశ ఎదురైంది.

ఏపీ ఎన్నికల తర్వాత తన సినిమాలతో తిరిగి బిజీ అయ్యారు బన్నీ వాసు. అల్లు ఫ్యామిలీకి ఏ కష్టం వచ్చినా ముందుంటారని ఆయనకు పేరుంది. పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే వివాహిత మరణించగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పీఎస్‌కు తరలించిన దగ్గరి నుంచి బన్నీ వెంటే వాసు ఉన్నారు. జైలులో టెక్నికల్ కారణాల రీత్యా అల్లు అర్జున్ విడుదలవ్వకపోవడంతో రాత్రంతా ఆయనకు తోడుగానే ఉన్నారు.
అల్లు అర్జున్ బెయిల్‌తో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ వచ్చారు. రేవతి కుటుంబానికి ఆర్ధిక సాయం అందించి ఇప్పటికీ ఆ ఫ్యామిలీకి తోడుగా నిలిచారు. ఎప్పుడూ బ్యాలెన్డ్స్‌గా మాట్లాడే బన్నీ వాసు తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే.. ఆయన నిర్మాతగా, అల్లు అరవింద్ సమర్పణలో నాగచైతన్య - సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది.

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా పైరసీ బారినపడింది. రిలీజైన మొదటి రోజే తండేల్ హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. ఇది కాకుండా కొన్ని లోకల్ ఛానెల్స్‌లోనూ ప్రసారం కావడంతో నిర్మాతలు షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే బన్నీ వాసు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తండేల్ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కొట్టేసిందని.. నాగచైతన్య - సాయిపల్లవిలు గుండెల్ని పిండేసేలా నటించారని వాసు చెప్పారు. నా సినిమాని, గీతా ఆర్ట్స్ సినిమాని పైరసీ చేసినోళ్లని గానీ .. డౌన్‌లోడ్ చేసినవాళ్లని గానీ అంత ఈజీగా వదలబోమని బన్నీ వాసు హెచ్చరించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశమవ్వగా.. పైరసీకి పాల్పడిన వారిపై గీతా కాంపౌండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











