Project K రిలీజ్ అప్పుడే.. ఆ సినిమా తరువాత ప్రభాస్ హాలీవుడ్ లోనే.. డౌట్ లేదు: ఆశ్వినీ దత్

బాహుబలి సినిమాలో దేశవ్యాప్తంగా క్రేజ్ అందుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ ఆ తర్వాత అంతకు మించి అనేలా తన స్థాయిని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ రేంజే దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది అనే చెప్పాలి. చూస్తుంటే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ప్రాజెక్ట్ K కూడా అంతకు మించి అనేలా ఉంటుంది అని అర్థమవుతోంది. ఇటీవల ఆ చిత్ర నిర్మాత సి.అశ్వనీదత్ కూడా అదే విషయాన్ని తెలియజేశారు. అలాగే ఆ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయాన్ని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు.

300కోట్లకు తక్కువ కాకుండా..

300కోట్లకు తక్కువ కాకుండా..

రెబల్ స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది అని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ప్రభాస్ లైన్ లో పెట్టిన సినిమాలు అన్నీ కూడా 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తోనే తెరపైకి రాబోతున్నాయి. అంచనాలకు ఏ మాత్రం తక్కువ కాకుండా నిర్మాతలు ప్రభాస్ పై భారీగా పెట్టుబడి పెడుతున్నారు.

అందరి ఫోకస్ ఆ మూవీ పైనే..

అందరి ఫోకస్ ఆ మూవీ పైనే..

కరోనా వ్యాప్తి లేకపోయి ఉంటే ఈపాటికే రాధేశ్యామ్ సినిమా థియేటర్స్ లో బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తూ ఉండేది. కానీ ఆ సినిమా అనుకోకుండా వాయిదా పడింది. ఇక ప్రస్తుతం చాలామందిలో ప్రభాస్ చేయబోతున్న భవిష్యత్తు ప్రాజెక్టులపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వైజయంతి మూవీస్ లో సైన్స్ ఫిక్షన్ గా రానున్న ప్రాజెక్ట్ K సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అని చెప్పవచ్చు.

రెండున్నరేళ్లు కష్టపడి..

రెండున్నరేళ్లు కష్టపడి..

మహానటి సినిమా తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ దాదాపు రెండున్నరేళ్లు కష్టపడి ప్రాజెక్ట్ K కథను సిద్ధం చేసుకున్నాడు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత సి.అశ్వనీదత్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు. అంతేకాకుండా సినిమా విడుదల తర్వాత అతని స్థాయి మరింత పెరిగి పోతుంది అని అన్నారు.

 ఇబ్బందులు లేకపోతే..

ఇబ్బందులు లేకపోతే..

ప్రాజెక్ట్ కే సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకుంది అని గ్రాఫిక్స్ పనులు కూడా మొదలయ్యాయి అని అన్నారు. కరోనా కారణంగా సినిమాకు మళ్లీ బయట పడే అవకాశం ఉంది అని ఒకవేళ ఎలాంటి ఇబ్బందులు లేకపోతే వీలైనంత త్వరగా ఈ ఏడాది లో సినిమా మొత్తం ఫినిష్ అవుతుంది అని కూడా అన్నారు.

రిలీజ్ అయ్యేది అప్పుడే..

రిలీజ్ అయ్యేది అప్పుడే..

ఇక అనుకున్న ప్లాన్ ప్రకారం కొనసాగితే మాత్రం 2023 ఫిబ్రవరి లేదా మార్చిలోనే ప్రాజెక్టు K ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పిన సి.అశ్వనీదత్ ఒకవేళ ఆలస్యమైతే రెండు మూడు నెలలు అటుఇటుగా రిలీజ్ డేట్ మారే అవకాశం ఉంటుందని కూడా అన్నారు. అయితే ప్రస్తుతం తమ టార్గెట్ మాత్రం వచ్చే ఏడాది మార్చిలోనే అని తెలియజేశారు.

హాలీవుడ్ లో ప్రభాస్

హాలీవుడ్ లో ప్రభాస్

అయితే ప్రాజెక్ట్ కే సినిమా విడుదల అయితే మాత్రం ప్రభాస్ స్థాయి ప్రపంచవ్యాప్తంగా ఈజీగా పెరిగిపోతుంది అని అతను వరుసగా హాలీవుడ్ సినిమాలు చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఎందుకంటే నాగ్ అశ్విన్ సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్టు K తో పాటు ప్రభాస్ క్రేజ్ కూడా ఆ సినిమాకు చాలా హెల్ప్ అవుతుంది అని సి.ఆశ్వినీ దత్ వివరణ ఇచ్చారు. మరి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X