For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ కలెక్షన్స్ ప్రజలను మోసం చేయడానికే.. రూ.200కోట్ల నుంచి 2000కోట్ల వరకు.. జాతిరత్నాలు కూడా: వీడియో లీక్

  |

  ఒకప్పుడు సినిమా ఎక్కువ రోజులు ఆడితే వంద రోజులు 200 రోజులు అని పోస్టర్లు ఎక్కువగా కనిపించేవి. ఇక ఆ తర్వాత పెద్ద సినిమాలకు బాక్సాఫీస్ కలెక్షన్స్ పోస్టర్లు కనిపించే ట్రెండ్ మొదలైంది. మొదటి రోజే వందకోట్లు మొదటి వారంలో రెండు వందల కోట్లు అంటూ బడా హీరోల సినిమాల పోస్టర్లు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి.

  అయితే ఇది నిజమా అబద్దమా అని ఓ వర్గం ప్రేక్షకులు నిత్యం ఒక అనుమానం మొదలవుతుంది ఉంటుంది. అయితే ఇటీవల టాలీవుడ్ నిర్మాతలు ఏపీ మంత్రి పేర్ని నానితో జరిగిన సమావేశంలో ఆ విషయంలో క్లారిటీ వచ్చేసింది. అవి ప్రజలను కోసం చేయడానికే అంటూ ఒక నిర్మాత ఊహించని విధంగా కుండబద్దలు కొట్టారు.

  Chiranjeevi తో స్టెప్పులేసి ఇరుగదీసిన సాయిపల్లవి .. అమీర్ ఖాన్‌ ఎమోషనల్‌గా

  టికెట్ల రేట్లు తగ్గడంతో

  టికెట్ల రేట్లు తగ్గడంతో

  ప్రస్తుతం తెలుగు సినిమాలు విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రేక్షకులు కూడా మంచి సినిమాలు వస్తే చూడడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం ఇటీవల తీసుకువచ్చిన కొత్త నిర్ణయంతో టికెట్ల ధరలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే. దీంతో చిత్ర నిర్మాతలు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కసారిగా టికెట్ల రేట్లు తగ్గించడం సినిమాలకు తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తాయి నిర్వహిస్తున్నారు.

  ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన శ్రీముఖి: ఎద అందాలు కనిపించేంత ఘాటుగా.. ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు

  సానుకూలంగా స్పందన

  సానుకూలంగా స్పందన

  గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు నిర్మాతలు సినీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా సోమవారం సినీ పెద్దలతో మంత్రి పేర్ని నాని సమావేశం జరిపారు. ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానంపై అలాగే సినిమా పరిశ్రమలో నెలకొన్న ఇతర సమస్యలపై వీలైనంత త్వరగా పరిష్కారం తీసుకురావాలని కోరగా మంత్రుల నుంచి సానుకూలంగా స్పందన వచ్చింది.

  Green India Challenge: నాగచైతన్యతో కలిసి మొక్కలు నాటిన అమీర్ ఖాన్.. ఎవరి సాయం లేకుండా..

  సి.కళ్యాణ్ వీడియో లీక్

  అయితే సమావేశంలో సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా పెద్ద సినిమాల్లో అయినా సరే చిన్న సినిమాలే అయినా సరే ఈ రోజులలో విడుదలైన మొదటి రోజే భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటున్నాయి అనేది మీడియాలో కథనాలు వినిపిస్తూ ఉంటాయి. ఆ విషయం పక్కన పెడితే చిత్రయూనిట్ సభ్యులు ప్రత్యేకంగా సోషల్ మీడియాలో కలెక్షన్స్ పోస్టర్స్ తో అంచనాలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి రోజు మా సినిమా భారీ స్థాయిలో పెరుగుతుందని ప్రత్యేకంగా పోస్టర్స్ ను విడుదల చేస్తూ ఉంటారు.

  Bigg boss telugu 5:విశ్వ భార్య ఎంత అందంగా ఉందొ చూసారా?.. రేర్ ఫొటోస్

  పోస్టర్స్ పై బాక్సాఫీస్ కలెక్షన్స్

  పోస్టర్స్ పై బాక్సాఫీస్ కలెక్షన్స్

  నేడు ఆంధ్ర ప్రదేశ్ మినిస్టర్ పేర్ని నాని తో జరిగిన సమావేశంలో సి.కళ్యాణ్ ఈ విధంగా కలెక్షన్స్ పై వివరణ ఇచ్చారు. గతంలో ప్రణబ్ ముఖర్జీ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు పలు సమస్యలపై చర్చలు జరిపాము. అయితే సినిమా పోస్టర్స్ లలో 200కోట్లు, 600కోట్లు, 2000కోట్లు అని బాక్సాఫీస్ కనబడుతుంటే మీరు ఇలా అడుగుతారేమిటి అని అన్నట్లు.. మమ్మలి ప్రశ్నించారు.

  జనాలని మోసం చేయడానికి..

  జనాలని మోసం చేయడానికి..

  అయితే కొన్ని సినిమాల కలెక్షన్స్ ఎంత మాత్రం నిజం కావు. అది కేవలం జనాలని మోసం చేయడానికి అలాంటి పోస్టర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అలా కలెక్షన్స్ వస్తున్నాయి అని తెలిస్తే జనాలు ఈ సినిమాను మిస్ అవుతున్నాము అనే ఆలోచనతో సినిమాను వచ్చి చూస్తారు. ఆ విధంగా సక్సెస్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ సినిమా ప్రపంచం లో ఇదొక మాయ అంటూ అది కూడా నిర్మాతలను కాపాడేందుకే అంటూ సి.కళ్యాణ్ ఇవ్వడం ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

  Sundeep Kishan Road Show | A1 Express విజయ యాత్ర
  జాతిరత్నాలు మంచి వసూళ్లను అందుకుంది..

  జాతిరత్నాలు మంచి వసూళ్లను అందుకుంది..

  అలాగే జాతి రత్నాలు అనే సినిమా మంచి కలెక్షన్స్ ను అందుకుందని కూడా సి.కళ్యాణ్ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అవుతున్నాయి గతంలో యావరేజ్ హిట్ గా నిలిచిన సినిమాల కలెక్షన్స్ పోస్టర్లను కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఈ సినిమాల కలెక్షన్స్ కూడా అంతా అబద్దమే అంటే చేస్తుండడం వైరల్ గా మారింది.

  English summary
  Producer c. Kalyan about tollywood box office fake collection posters
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X