ఆ ఇద్దరి మరణాలతో కుంగిపోయా.. నాకు ఈ భిక్ష పెట్టింది ఆయనే.. నిర్మాత సీ కల్యాణ్ ఎమోషనల్

స్వ‌ర్గీయ రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి త‌న‌యుడు మేఘాంశ్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతోన్న చిత్రం రాజ్ ధూత్. న‌క్ష‌త్ర‌, ప్రియాంక వ‌ర్మ హీరోయిన్లు. ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై అర్జున్ -కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్.ఎల్.వి స‌త్య‌నారాయ‌ణ‌(స‌త్తిబాబు) నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైద‌రాబాద్ జెఆర్ సీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లో సినీ ప్ర‌ముఖ‌ల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ సందర్బంగా నిర్మాత సి. క‌ల్యాణ్ మాట్లాడుతూ...

టాలీవుడ్‌లో నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కార‌ణం మా బావ‌ ( శ్రీహ‌రి). ఇద్ద‌రిది 35 ఏళ్ల అనుబంధం. నాకు హైద‌రాబాద్‌లో ఇల్లు కొనిచ్చింది ఆయనే. దాని పేరు శ్రీహ‌రి నిల‌యం. శాంతి చేతుల మీదుగా ఆ ఇంటి గృహ ప్రవేశం జరిగింది అని కల్యాణ్ గుర్తు చేసుకొన్నారు.

ఓ రోజు నిర్మాత స‌త్తిబాబు నాకు షాకిచ్చాడు. శ్రీహ‌రి గారి అబ్బ‌ాయితో సినిమా స్టార్ట్ అయింది చెప్పడం కంగు తిన్నాను. అయితే ఆ అవకాశం నాకు దక్కలేదని బాధపడ్డాను. మా పెద్దొడి ( శ్రీహ‌రి పెద్ద కొడుకు) ద‌ర్శ‌క‌త్వంలో చిన్నోడు హీరోగా ఓ సినిమా నిర్మిస్తా. ఎంత ఖ‌ర్చు అయినా చేస్తా అన్నారు.

 Producer C Kalyan gets emotional in Rajdoot pre release

ఇప్ప‌టివ‌రకూ నా జీవితంలో రెండు మరణాలు నన్ను తీవ్ర విషాదంలోకి నెట్టాయి. ఎన్టీఆర్ త‌ర్వాత‌ శ్రీహ‌రి చ‌నిపోయిన‌ప్పుడు చాలా బాధకు గురయ్యాను. ఇసుకేస్తే రాలనంత జ‌నం వ‌చ్చారు. 16 కిలోమీట‌ర్ల మేర జ‌నాలంతా న‌డుచుకునే వ‌చ్చారు. ఇంటికి ఉండే అన్ని కాంపౌండ్ వాల్స్ ప‌డిపోయాయి. అంటే మా బావ‌ జనంలో అంత అభిమానం సంపాదించుకున్నారు. త‌న‌తో జ‌ర్నీ చేసిన వారు ఎప్ప‌టికీ మ‌ర్చిపోరు. ప్రతీ నిర్మాత బావ గురించి ఎలా మాట్లాడుకునే వారు. మేఘాంశ్ గురించి అలాగే మాట్లాడుకోవాలి. తండ్రిలా పెద్ద స్టార్ అవ్వాలి. రాజ్‌ధూత్ టీమ్‌లో మంచి ఫైర్ ఉంది. సినిమా విజ‌యం సాధించి అంద‌రికీ మంచి పేరు తీసుకు రావాలి అని నిర్మాత సీ కల్యాణ్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X