నిర్మాత రామానాయుడిపై మోజుపడ్డ హీరోయిన్లు ఎవరో తెలుసా? ఆ స్టార్ హీరోయిన్ ఏమన్నదంటే?

నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, స్టూడియో అధినేతగా తెలుగు చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేశారు డాక్టర్ డి. రామానాయుడు. కృషి, పట్టుదలకి, నిరంతర శ్రమకి మారుపేరుగా విలువలతో కూడిన వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలిచారు . 13 భారతీయ భాషల్లో 150కి పైగా సినిమాలు తీసి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలు నిర్మించిన వ్యక్తిగా 2008లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ స్థానం సంపాదించారు. పది రూపాయల నోటుపై ఉన్న అన్ని భాషల్లో చిత్రాలను నిర్మించిన నిర్మాతగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అలాంటి రామానాయుడు తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం. ఆయన ఓ ఇంటర్వ్యూలో సరదగా సమాధానం ఇస్తూ..

ఏదో ఒక వ్యాపారం చేసి జీవితంలో నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో మద్రాస్‌లో అడుగుపెట్టిన రామానాయుడు ఊహించని విధంగా నిర్మాతగా స్థిరపడ్డారు. 1964లో సురేష్ ప్రొడక్షన్స్‌ను నెలకొల్పి నటసార్వభౌముడు ఎన్టీఆర్‌తో రాముడు - భీముడు తెరకెక్కించారు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తూ ముందుకు వెళ్లిన ఆయన ఒక దశలో వరుస ఫ్లాపులతో నష్టాలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కృంగిపోకుండా ఏఎన్ఆర్‌తో భారీ బడ్జెట్‌తో ప్రేమ్ నగర్ తీశారు. నాడు తెలుగునాట భారీ వర్షాలు ముంచెత్తినా సరే జనం ప్రేమ్ నగర్ చూసేందుకు థియేటర్లకు పరుగులు తీశారు. ఈ సినిమా ఘన విజయంతో ఇక రామానాయుడు వెనుదిరిగి చూసుకోలేదు. తన జీవితానికి రాముడు భీముడు విత్తనమైతే, ప్రేమ్‌నగర్ చెట్టు అంటూ ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు.

producer D Ramanaidu Funny answer about Love affairs in the Telugu Film Industry

తన సినిమాల ద్వారా ఎందరో హీరో, హీరోయిన్లు, దర్శకులు , టెక్నీషియన్లను రామానాయుడు చిత్రసీమకు పరిచయం చేశారు. తనను ఇంతడివాడిగా చేసిన సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు, వృద్ధాశ్రమంతో పాటు సినీ కార్మికుల సంక్షేమం కోసం విరాళాలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ టికెట్‌పై బాపట్ల ఎంపీగా గెలిచి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు.

ఆయన తనయులు సురేష్ బాబు అగ్ర నిర్మాతగా , వెంకటేష్ అగ్ర కథానాయకుడిగా, మనవడు రానా హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. సినీ రంగానికి రామానాయుడు చేసిన సేవలకు గాను ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు ఆయనను వరించాయి. 2009లో దాదాసాహెబ్ ఫాల్కే , 2012లో పద్మభూషణ్‌లతో భారత ప్రభుత్వం రామానాయుడిని సత్కరించింది. అలాగే రఘుపతి వెంకయ్య అవార్డ్, ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్‌లను ఆయన అందుకున్నారు.

producer D Ramanaidu Funny answer about Love affairs in the Telugu Film Industry

స్వతహాగా రామానాయుడు మంచి అందగాడు. ఒడ్డూ పొడుగుతో హీరోకు కావాల్సిన క్వాలిటీస్ అన్ని ఆయనలో ఉన్నాయి. మరి నాయుడుపై ఎవరూ మనసు పడలేదా ... ఈ డౌట్ చాలామందికి వచ్చింది. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనను యాంకర్ ఇదే ప్రశ్న అడగ్గా రామానాయుడు తనదైనశైలిలో ఆన్సర్ ఇచ్చారు. ప్రతిరోజూ షూటింగ్ స్పాట్‌కు వైట్ అండ్ వైట్‌లో కారులో దిగే రామానాయుడి వంక సెట్‌లో ఉన్న హీరోయిన్లు సహా ఆడపిల్లలంతా చూసేవారట. అది చూసి దిగ్గజ నటి శాంతకుమారి .. ఈ ముండలంతా నిన్నే చూస్తున్నార్రా, హీరోగా యాక్ట్ చేయమని ఆటపట్టించేవారని రామానాయుడు గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X