twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హీరో ఎవడో తెలియదు.. ఆ సినిమాకు అన్ని థియేటర్లు.. సంక్రాంతి రిలీజ్ వివాదంపై ఘాటుగా సురేష్ బాబు

    |

    విక్టరీ వెంకటేష్ బర్త్ డే కానుకగా డిసెంబర్ 13న 'నారప్ప' చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. వెంకటేష్ హీరోగా, సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన నారప్ప కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీలో విడుదలైంది. అయితే నారప్ప చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై చూడాలని ఆశపడ్డారు అభిమానులు. ఇప్పుడు నారప్ప థియేటర్స్‌లో విడుదలవుతున్న నేపథ్యంలో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి రేసులో తమిళ చిత్రాల విడుదల గురించి తలెత్తిన వివాదంపై నిర్మాత సురేష్ బాబు దగ్గుబాటి మీడియాతో మాట్లాడుతూ..

    కేజీఎఫ్2, కాంతారకు ఆ రేంజ్ సక్సెస్

    కేజీఎఫ్2, కాంతారకు ఆ రేంజ్ సక్సెస్


    టాలీవుడ్‌కు సంబంధించిన RRR, పుష్ప సినిమాలను తమిళనాడులో ఆదరించి భారీ ఎత్తున్న రిలీజ్ చేశారు. వారి సినిమాలను మనం కూడా ఆదరించి రిలీజ్ చేయాలి. లేకపోతే ఇది ప్రతీసారి సమస్యగా మారుతుంది. ప్రస్తుతం సినిమా భాష, ప్రాంతాల సరిహద్దులను చెరిపేసింది. కేజీఎఫ్2, కాంతార చిత్రాలు ఆ రేంజ్ సక్సెస్ ఎవరైనా ఊహించారా? ఇండియాలో ఎవరూ కూడా ఊహించలేదు. వాటి వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. వాటిని పరిష్కరించుకోవాలి అని డీ సురేష్ బాబు అన్నారు.

    అవతార్ 2 కోసం దేశవ్యాప్తంగా

    అవతార్ 2 కోసం దేశవ్యాప్తంగా


    తమిళనాడులో RRR అంటూ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకొన్నారు. ఎన్టీఆర్, రాంచరణ్ కోసం తమిళనాడులో థియేటర్లన్నీ ఇచ్చేశారుగా.. ఆ రోజు మనం ఏం మాట్లాడలేదు ఎందుకని.. హీరోను బట్టి థియేట్రికల్ రిలీజ్ భారీగా ఉంటుంది. హాలీవుడ్ సినిమా అవతార్ 2 కోసం దేశవ్యాప్తంగా థియేటర్లు ఇచ్చాం. ఇంతకు ఆ సినిమాల హీరో ఎవరో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని మనం అధిగమించాలి. అవతార్ సంక్రాంతికి వస్తే పరిస్థితి ఏమిటి? థియేటర్లు రాలేదని నిర్మాతలు బాధపడటంలో కొంత న్యాయం ఉంది అని సురేష్ బాబు దగ్గుబాటి అన్నారు.

     తెలుగులో వచ్చే పాన్ ఇండియా మూవీ

    తెలుగులో వచ్చే పాన్ ఇండియా మూవీ


    వచ్చే సంక్రాంతి అజిత్, విజయ్ సినిమా వస్తే.. తెలుగులో వచ్చే పాన్ ఇండియాను అక్కడ వేస్తారు. రాజమౌళి తీసే మహేష్ బాబు సినిమా కావొచ్చు. లేదా ఫుష్ప 2 కావొచ్చు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సర్దుబాటు చేసుకోవాలి. నిర్మాతలే ఎగ్జిబ్యూటర్లు కాబట్టి ఈ పరిస్థితిని సానుకూలంగా పరిష్కరించుకోవాలి అని సురేష్ బాబు చెప్పారు.

    అందరికీ థియేటర్స్ ఇవ్వాలి..

    అందరికీ థియేటర్స్ ఇవ్వాలి..


    సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలన్నింటిని రిలీజ్ చేయాలి. ఎవరి సినిమాని ఆపలేం. అన్ని సినిమాలు విడుదల కావాలి. అందరికీ థియేటర్స్ ఇవ్వాలి. అందరూ విడుదల చేసుకోవాలి. బెటర్ సినిమాకి బెటర్ థియేటర్లు దొరుకుతాయి తప్పితే ఒకరిని ఆపే ప్రసక్తే ఉండదు అని సురేష్ బాబు స్పష్టం చేశారు.

     డబ్బు కూడా అంతే వచ్చేదేమో..

    డబ్బు కూడా అంతే వచ్చేదేమో..


    వెంకటేష్ నటించిన నారప్ప, దృశ్యం 2 థియేటర్స్‌‌లో రిలీజ్ కాలేదు. ఆ విషయంలో నాకు చిన్న అసంతృప్తి ఉంది. ఆ రెండు సినిమాలు బావున్నాయనే టాక్ వచ్చింది. థియేటర్స్ రిలీజ్ అయితే అవి బాగా ఆడేవి. డబ్బు కూడా అంతే వచ్చేదేమో. కానీ అప్పటి కరోనా సమయంలో పరిస్థితి అందోళనకరంగా ఉండేది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థతో నాకు పర్శనల్ రిలేషన్‌షిప్‌తో ఒక్క రోజు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చారు. వాళ్ళ బిజినెస్ వాళ్లకి ఉంది అని డీ సురేష్ బాబు చెప్పారు.

    English summary
    Producer Daggubati Suresh Babu about Avatar 2 movie and Ajith and Vijay's Sankranti Releases contraversy. He said, All movies should be released with any discrimination.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X