టాలీవుడ్ నిర్మాతకు సీఎం జగన్ కీలక పదవి.. విధేయతకు పట్టం అంటూ కామెంట్
టాలీవుడ్ నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌కు ఏపీ ప్రభుత్వం కీలక పదవితో గౌరవించింది. సీఎం వైఎస్ జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్న కిరణ్‌కుమార్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్‌గా నియమిస్తూ ఏపీ సర్కార్ జీవోను జారీ చేసింది. తనను టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించినందుకు నిర్మాత కిరణ్ కుమార్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ నియామకానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
కలియుగ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో అన్నివర్గాలకు ప్రాతినిథ్యం వహించే విధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రముఖులకు బోర్డు సభ్యులుగా నియామకం చేపడుతున్నది. ఈ క్రమంలోనే నిర్మాత కిరణ్ కుమార్‌కు ఏపీ సర్కార్ గౌరవ పదవిని కట్టబెట్టింది. తెలుగు సినిమా పరిశ్రమకు పెద్ద పీట వేయాలని, అలాగే పరిశ్రమ నుంచి ఒకరికి ప్రాతినిథ్యం వహించేలా చూడాలని ఈ నిర్ణయం తీసుకొన్నది. ప్రస్తుతం టీటీడీ బోర్డులో మొత్తం 24 మంది సభ్యులకు స్థానం ఉంది. చాలా మంది టీటీడీ బోర్డులో సభ్యుడి కావాలనే జీవితాశయం ఉన్నవారు చాలా ఉన్నారు. ప్రస్తుతం కిరణ్ కుమార్‌ను ఈ అదృష్టం వరించింది.

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి నిర్మాత కిరణ్ కుమార్ స్నేహితుడు, అత్యంత సన్నిహితుడు. ఈ సందర్భంగా తనను టీటీడీ బోర్డు మెంబర్‌గా నియమించినందుకు సీఎం వైఎస్ జగన్, ఎంపీ బాలశౌరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా దాసరి కిరణ్ మాట్లాడుతూ.. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్‌కు పెద్ద అభిమానిని. నా నియామకంతో పార్టీకి విధేయులకు తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుంది అని కిరణ్ కుమార్ అన్నారు.
దాసరి కిరణ్ కుమార్ విషయానికి వస్తే.. తెలుగు సినిమా పరిశ్రమలో వస్తా నీ వెనుక, సిద్దార్థ, వంగవీటి, రాంలీలా, జీనియస్ అనే చిత్రాలను నిర్మించారు.


Click it and Unblock the Notifications











