థాంక్యూ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎమోషనల్ అయిన దిల్ రాజు.. భార్య అనిత వల్లే ఇలా అంటూ!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా దిల్‌ రాజు, ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు, శిరీష్ నిర్మించిన తాజా మూవీ 'థాంక్యూ'. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 22న విడుదలవుతుంది. ఈ సందర్భంగా శనివారం సినిమా యూనిట్ వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో డీలర్ రాజు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే

అన్ని చూసి వచ్చి

అన్ని చూసి వచ్చి

ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ వైజాగ్‌తో మంచి అనుబంధం ఉందని అన్నారు. అక్కినేని అభిమానులు ఎనర్జీ జూలై 22 వరకు ఉంచుకోమని కోరిన ఆయన చైతన్యను సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతంగా చూసి ఎంజాయ్ చేస్తారని అన్నారు. థాంక్యూ ఐడియాను స్టోరిలాగా ర‌వి చెప్పిన‌ప్పుడు పాయింట్ న‌చ్చిందని, ఈ పాయింట్‌ను చెప్పాలంటే మంచి జ‌ర్నీ కావాల‌ని త‌న‌తో చెప్పానని అన్నారు. ఆ జ‌ర్నీ ఎలా ఉంటుందో రేపు థియేటర్స్‌లో చూస్తారని అన్నారు. ఈ జ‌ర్నీని నా లైఫ్‌కి చెక్ చేసుకున్నాను. లైఫ్‌లో అన్ని చూసి వ‌చ్చిన వాడినని అన్నారు.

నా ఒక్క‌డి వ‌ల్ల‌నే

నా ఒక్క‌డి వ‌ల్ల‌నే

థాంక్యూ అని చాలా ఈజీగా వాడేస్తుంటాం. కానీ .. మ‌న జీవితంలో ఇంపార్టెంట్స్ ప‌ర్స‌న్ .. అమ్మ నాన్న‌, గురువు, తోబుట్టువులు, ఫ్రెండ్స్ ఇలా చాలా మంది ఉంటారని అన్నారు. నా లైఫ్ జ‌ర్నీని వెన‌క్కి చూసుకుని చాలా మందికి థాంక్యూ చెప్పాల‌నిపించిందని, ఇంత దూరం వ‌చ్చానంటే ఇది నా ఒక్క‌డి వ‌ల్ల‌నే కాలేదు. ఎంతో మంది స‌పోర్ట్ చేశారని అన్నారు. అందులో ముందుగా అమ్మ నాన్న‌కి థాంక్స్. ఎందుకంటే జ‌న్మ‌ను ఇవ్వ‌ట‌మే కాదు.. మంచి చెడులు చెప్పించి మంచి వ్య‌క్తిని తీర్చిదిద్దారని అన్నారు.

కాస్ట్యూమ్ కృష్ణ‌గారికి

నా సోద‌రులు, సిస్ట‌ర్స్ అంద‌రికీ థాంక్స్‌ అని అన్నారు. నా చ‌దువు అయిపోయిన‌ప్పుడు ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను. నాకు వ్యాపారంలో స‌పోర్ట్ చేసిన వారికి థాంక్యూ చెప్పారు. సినిమా అంటే ప్యాష‌న్‌ కానీ నాకు ఏమీ తెలియ‌దు. వైజాగ్ డిస్ట్రిబ్యూట‌ర్‌గా అల్లుడా మ‌జాకా సినిమాతో వ్యాపారం స్టార్ట్ చేశానని అన్నారు. ఆరోజు న‌న్ను ఇండ‌స్ట్రీలోకి తీసుకొచ్చిన మ‌హేందర్ రెడ్డిగారికి థాంక్స్‌. నాకు మొద‌టి స‌క్సెస్ ఇచ్చిన పెళ్లి పందిరి నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ‌గారికి థాంక్స్‌ చెప్పారు.

అనిత‌కి థాంక్స్

అనిత‌కి థాంక్స్

కోడి రామ‌కృష్ణ‌గారికి థాంక్స్‌. స‌క్సెస్ ఫెయిల్యూర్స్ ఉన్నాయన్న ఆయన తన స‌తీమ‌ణి అనిత‌.. 27 ఏళ్ల నా ప్ర‌యాణంలో అండ‌గా నిల‌బ‌డిందని అన్నారు. న‌న్ను ముందుకు వెళ్లేలా చేసింది. నిర్మాత‌గా మారిన‌ప్పుడు దిల్ సినిమా ఇచ్చిన వినాయ‌క్‌గారికి థాంక్స్‌ చెప్పిన ఆయన అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 50 సినిమాలు పూర్తి చేస్తున్న‌ప్పుడు .. సపోర్ట్ చేసిన దర్శకులకి థాంక్స్ చెప్పారు.

ప్ర‌తీ ఒక్క‌రికీ థాంక్స్‌

ప్ర‌తీ ఒక్క‌రికీ థాంక్స్‌

టాప్ స్టార్స్ అల్లు అర్జున్‌, ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్, ప‌వ‌న్ క‌ళ్యాణ్, మ‌హేష్ బాబు, నాని, చైత‌న్య‌.. అంద‌రికీ థాంక్స్‌ అని చెప్పారు. ప్ర‌తీ ఒక్క‌రికీ థాంక్స్‌ అని అన్నారు. రేపు సినిమా చూస్తే నా ఎమోష‌న్ మీకు అర్థ‌మ‌వుతుంది. రేపు సినిమాలో చైత‌న్య మూడు వేరియేష‌న్స్ స్క్రీన్‌పై చూస్తారన్న ఆయన ఈ థాంక్యూ సినిమాలో బ్యూటీఫుల్ ల‌వ్ స్టోరి, కాలేజ్ స్టోరి, లైఫ్ స్టోరి ఉంటుందని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X