లాక్‌డౌన్‌లో దిల్ రాజు రెండో పెళ్లి.. సినీ ప్రముఖులు దూరం.. ఫోటోలు వైరల్..

ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో వివాహం చేసుకొన్నారు. కొన్ని నెలల క్రితం ఆయన సతీమణి అనారోగ్యంతో మరణించడంతో ఆయన విషాదంలో కూరుకుపోయారు. తాజాగా ఆయన పెళ్లి వార్త మీడియాలో ప్రముఖంగా మారింది. ఈ క్రమంలో దిల్ రాజు స్పందిస్తూ.. పెళ్లి చేసుకొంటే తాను అందరికి తెలియజేసి చేసుకొంటాను అని వివరణ ఇచ్చారు. తాజాగా దిల్ రాజు తన సొంతూరుకు సమీపంలోని ఓ ఆలయంలో ఆదివారం రాత్రి వివాహం చేసుకొన్నారు. ప్రస్తుతం ఆయన పెళ్లి ఫోటోలు వైరల్ అయ్యాయి.

Recommended Video

Dil Raju Second Marriage Photos Gone Viral In Social Media
 భార్య మరణంతో ఒంటరిగానే

భార్య మరణంతో ఒంటరిగానే

ఓ సినిమా షూటింగ్ కారణంగా దిల్ రాజు విదేశాల్లో ఉండగా.. ఆయన భార్య అనిత 2017లో మృతి చెందిన సంగతి తెలిసిందే. భార్య మృతితో మానసికంగా దిల్ రాజు కుంగిపోయాడు. వ్యక్తిగత వ్యవహారాలను చూసుకోవడానికి దిల్ రాజుకు తోడు కావాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు. ఇటీవల ఆయనను పెళ్లికి ఒప్పించడం జరిగింది. ఈ క్రమంలోనే లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో వివాహాన్ని నిరాడంబరంగా నిజామాబాద్‌లో అతికొద్ది మంది హాజరుకాగా జరిపించారు.

 ఆదివారం స్వయంగా దిల్ రాజు వెల్లడి

ఆదివారం స్వయంగా దిల్ రాజు వెల్లడి

తన పెళ్లి వార్తను స్వయంగా దిల్ రాజు ఆదివారం మీడియాకు వెల్లడించారు. ప్రపంచం పరిస్థితి అంతగా బాగాలేదు. ఇప్పట్లో కోలుకుంటుందని నేను అనుకోవడం లేదు.ఇలాంటి సమయంలో నేను ప్రొఫెషనల్‌గా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతా త్వరలోనే సర్దుకుంటుందని భావిస్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకొంటున్నాను. ఈ సమయం నాకు అన్ని విధాల కలిసి వస్తుందని భావిస్తున్నాను అని ఓ ప్రకటనలో దిల్ రాజు పేర్కొన్నారు.

 సినీ ప్రముఖులు దూరంగా

సినీ ప్రముఖులు దూరంగా

లాక్‌డౌన్ కారణంగా దిల్ రాజు రెండో వివాహం అత్యంత నిరాడంబరంగా జరిగింది. కేవలం కుటుంబ సభ్యుల్లో అతి ముఖ్యులు ఈ పెళ్లికి హాజరయ్యారు. సినీ ప్రముఖులు, సన్నిహితులు లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా చాలా మంది దూరంగా ఉన్నారు. లాక్‌డౌన్ పరిస్థితులు చక్క దిద్దుకొన్న తర్వాత సినీ వర్గాలకు పెళ్లి విందును ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు ఫోన్‌లో వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.

రూమర్లకు తెర

రూమర్లకు తెర

కొద్దిరోజులుగా నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి సెన్సేషన్‌గా మారింది. మీడియాలో దిల్ రాజు పెళ్లి అయిపోయిందని వార్తలు వచ్చాయి. ఆ క్రమంలో తన రెండో పెళ్లిపై ఇలాంటి అసత్య ప్రచారాలేంటని? ఒకవేళ చేసుకుంటే.. అందరికీ చెప్పే చేసుకుంటాను అని వివరణ ఇచ్చారు. తాజాగా పెళ్లి కార్యక్రమంతో అలాంటి వార్తలకు తెరపడినట్టయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X