గేమ్ ఛేంజర్ ఫెయిల్యూర్.. మన పెత్తనం సహించరు.. శంకర్‌పై దిల్‌రాజు ఇన్‌డైరెక్ట్ కామెంట్స్
తమిళ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ భారీ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. తొలి ఆట నుంచే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాపై నెగిటివ్ ట్రోలింగ్ మరింత దెబ్బ కొట్టింది. చివరికి నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగిల్చింది గేమ్ ఛేంజర్. ఈ సినిమా రిజల్ట్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు నిర్మాత దిల్‌రాజు.
డిజాస్టర్‌గా గేమ్ ఛేంజర్
గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా.. అంజలి , ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో గేమ్ ఛేంజర్ నిర్మించారు దిల్‌రాజు. ఆయన బ్యానర్‌లో ఇలాంటి భారీ చిత్రం రావడం ఇదే తొలిసారి. షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ నత్తనడకన సాగుతూ వచ్చింది. ఆటంకాలను అధిగమించి జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజైంది. థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం ఇండియాలో రూ.131.2 కోట్ల నెట్.. రూ.156.03 కోట్ల గ్రాస్ రాబట్టింది. అలాగే ఓవర్సీస్‌లో రూ.30.25 కోట్లు అందుకుంది. ఓవర్సీస్ + ఇండియా గ్రాస్ కలిపి మొత్తంగా రూ.186.28 కోట్ల కలెక్షన్స్‌ను గేమ్ ఛేంజర్ ఆర్జించి భారీ నష్టాలను మిగిల్చింది.

గేమ్ ఛేంజర్‌పై ట్రోలింగ్
థియేటర్‌లో ఉండగానే గేమ్ ఛేంజర్‌పై సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్ నడిచింది. కొందరు ఈ సినిమా హెచ్‌డీ ప్రింట్‌ను ఆన్‌లైన్‌లో లీక్ చేయగా.. చాలా చోట్ల బస్సుల్లో, లోకల్ ఛానెల్స్‌లోనూ ప్రదర్శించారు. ఈ పరిణామాలు సినిమాపై దెబ్బకొట్టి డిజాస్టర్‌గా నిలబెట్టాయి. గేమ్ ఛేంజర్ రిజల్ట్‌పై మెగాస్టార్ చిరంజీవి, సంగీత దర్శకుడు థమన్ సహా పలువురు స్పందించారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో బడా నిర్మాతల్లో ఒకరిగా వెలుగొందుతూ.. ఇండస్ట్రీని శాసించే వ్యక్తుల్లో ఒకరైన దిల్‌రాజు జడ్జిమెంట్‌పైనా గేమ్ ఛేంజర్ విమర్శలు గుప్పించింది.
దిల్‌రాజు లెక్క తప్పిందా?
దిల్‌రాజు ఓ ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నారంటే ఎన్నో లెక్కలు వేసుకుంటారని, ఒకటి రెండు సార్లు తప్పించి ఎప్పుడూ ఆయన లెక్క తప్పలేదని ఇండస్ట్రీలో పేరు. అలాంటిది గేమ్ ఛేంజర్ విషయంలో ఆయన ఎందుకు తడబడ్డారని ప్రశలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ వ్యవహారంపై దిల్‌రాజు స్పందించారు. నితిన్ హీరోగా ఆయన నిర్మించిన తమ్ముడు సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్‌రాజు మాట్లాడారు.
పెద్ద డైరెక్టర్లు వేలు పెట్టనివ్వరు
'పెద్ద సినిమా, పెద్ద డైరెక్టర్‌తో చేసినప్పుడు 100 శాతం కొన్ని సమస్యలు ఉంటాయని.. ఇది దిల్‌రాజుకే కాదని అందరికీ ఆ ప్రాబ్లమ్ ఉంటుంది. గేమ్ ఛేంజర్‌ను నాలుగున్నర గంటల పాటు తీశారని ఎడిటర్ చెప్పిన మాట నిజం. పెద్ద డైరెక్టర్ సినిమా చేస్తున్నప్పుడు మనల్ని జోక్యం చేసుకోనివ్వరు.. అయితే ఏంటీ ప్రాబ్లం అంటే, డైలీ కిచిడీ ఉంటుంది, మొత్తం అయిపోయాక చూసుకోవాలి. తప్పు జరిగేటప్పుడు ఆపాల్సిన బాధ్యత ప్రొడ్యూసర్‌దే.. దానిని నేను ఆపలేకపోయానంటే అది నా ఫెయిల్యూరే' అని దిల్‌రాజు అంగీకరించారు.
గేమ్ ఛేంజర్ ఒప్పుకోవడమే తప్పు
'అలాంటి ప్రాజెక్ట్ నేను ఒప్పుకోకూడదు. 60 సినిమాలు కంప్లీట్ అవుతున్న సమయంలో పెద్ద దర్శకులతో తీసిన సినిమాలు లేవు. కాబట్టి నా ఫస్ట్ రాంగ్ స్టెప్ అదే. పెద్ద దర్శకులతో తీస్తున్నప్పుడు కాంట్రాక్ట్‌లో క్లియర్‌గా నా పాయింట్స్ పెట్టి సినిమాకు వెళ్లాలి. కానీ వెళ్లలేదు.. అది నా మిస్టేక్ కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నా. ఇది మన స్కూల్ కాదు.. దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. గేమ్ ఛేంజర్ ఫైనల్ కట్ నేను ముందే చూశా. డైరెక్టర్‌కి, ప్రొడ్యూసర్‌కి, హీరోకి వేవ్ లెంగ్త్ సరిగా కుదరాలి' అని దిల్‌రాజు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











