కష్టకాలంలో ఉహీంచని లీకేజ్ దెబ్బ... పోలీసుల వద్దకు దిల్ రాజు..

చాలా రోజుల తరువాత తెలుగు చిత్ర పరిశ్రమలో లీకేజ్ వివాదాలు మొదలయ్యాయి. అసలే కరోనా కారణంగా సినిమాలను విడుదల చేసుకోలేక అష్టకష్టాలు పడుతుంటే కొత్త సినిమాలకు సంబంధించిన సీన్స్ ఇంటర్నెట్ వరల్డ్ లో లీక్ చేస్తున్నారు కొందరు. అయితే ఇటీవల అలాంటి చేదు అనుభవం ఎదుర్కొన్న దిల్ రాజు విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన త్వరలోనే పోలీసులను కూడా కలవబోతున్నట్లు తెలుస్తోంది.

వకీల్ సాబ్ సీన్స్ లీక్..

వకీల్ సాబ్ సీన్స్ లీక్..

సోమవారం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కి సంబంధించిన ఒక సీన్ లీక్ అయిన విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇంటర్నెట్ లో బాగానే వైరల్ అయ్యాయి. అయితే ఆ లీకేజ్ ఎక్కువ సేపు వైరల్ అవ్వకముందే దిల్ రాజు టీమ్ జాగ్రత్త పడింది. ఆ వీడియో వైరల్ అవ్వకముందే ఫ్యాన్స్ సాయంతో అరికట్టారు.

పోలీసుల వద్దకు దిల్ రాజు..

పోలీసుల వద్దకు దిల్ రాజు..

అయితే ఈ లీకేజ్ విషయంపై దిల్ రాజు చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అసలు దీనికి కారకులు ఎవరనే విషయం గురించి కనిపెట్టడంలో బిజీగా ఉన్నారు. అలాగే దిల్ రాజు పోలీసులను సంప్రదించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు సిరియస్ గా తీసుకోకపోతే చాలా ప్రమాదమని దిల్ రాజు ఈ విధంగా అడుగులు వేస్తున్నారట.

కష్టకాలంలో నిర్మాత..

కష్టకాలంలో నిర్మాత..

ఇప్పటికే షూటింగ్స్ పూర్తి చేయలేక సినిమా రిలీజ్ చేయలేక దిల్ రాజు చాలా ఇబ్బంది పడుతున్నాడు. లాక్ డౌన్ కారణంగా తుది దశలో ఉన్న వకీల్ సాబ్ షూటింగ్ తో పాటి దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న మరికొన్ని సినిమాలు కూడా చాలా వరకు మధ్యలోనే ఆగిపోయాయు. నాని V సినిమా రిలీజ్ డేట్ గత కొన్ని నెలలుగా మారుతూనే ఉంది.

Recommended Video

Shruti Haasan Demands Huge Remuneration For Pawan Kalyan's Movie
వకీల్ సాబ్ రిలీజ్..?

వకీల్ సాబ్ రిలీజ్..?

ఇలాంటి కష్టకాలంలో దిల్ రాజుకి మళ్ళీ మరో దెబ్బ పడటం చర్చనీయాంశంగా మారింది. ఇక వకీల్ సాబ్ కి సంబంధించి ఇంకా 20శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉందట. కరోనా లాక్ డౌన్ లేకపోయి ఉంటే.. ఇప్పటికే సినిమా రిలీజ్ అయ్యుండేది. ఇక థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. మరి వకీల్ సాబ్ రావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X