Game Changer: గేమ్ ఛేంజర్ నుంచి అదిరిపోయే అప్‌డేట్ లీక్ చేసిన దిల్ రాజు.. ఏంటో తెలుసా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత నుంచి ఆయన తర్వాతి సినిమాపై పెద్ద ఎత్తన బజ్ క్రియేట్ అయింది. దేశవ్యాప్తంగా ఆయన ఫ్యాన్స్ అందరూ రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు ముఖ్యంగా చెర్రీ హీరోగా రాబోతున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రకటించి.. షూటింగ్ ప్రారంభం అయి చాలా రోజులు అవుతోంది. ఏడాది కాలంగా ఈ సినిమా షూటింగ్ కొననసాగుతూనే ఉంది.
ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కన కియా కియారా అద్వానీ హీరోయన్ గా నటిస్తోంది. అలాగే అంజలి, సముద్రఖని, ఎస్.జే సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా.. ఎస్ తిరునావుక్కరసు సినిమాటోగ్రఫీ పనులు చూసుకుంటున్నారు. అలాగే షమీర్ ముహమ్మద్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకోగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రామ్ చరణ్ హీరోగా రాబోతున్న ఈ సినిమా దిల్ రాజుకి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. ఎందుకుం అంటే ఆయన హోం బ్యానర్ లో రాబోతున్న 50వ చిత్రం ఇదే. అందుకే ఆయన చాలా కేర్ తీసుకుంటూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచేలా ప్లాన్ చేస్తున్నారు. దీపావళి పండుగకు ఈ సినిమా నుంచి ఏదో ఒక అప్ డేట్ వస్తుందని అంతా అనుకున్నారు. ముఖ్యంగా జరగండి, జరగండి అంటూ సాగే ఫస్ట్ సింగిల్ విడుదల అవుతుందని అంతా అనుకున్నారు. కానీ దాన్ని ఇప్పుడే విడుదల చేయట్లేదంటూ ప్రకటించి అందరికీ షాకిచ్చారు.

అయితే తాజాగా ఈ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజ్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. గేమ్ ఛేంజర్ సినిమా ఇప్పటికే 90 శాతానికి పైగా పూర్తి అయినట్లు ప్రకటించారు. మరికొద్ది రోజుల్లోనే సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభిస్తామని.. వీలయినంత త్వరగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని దిల్ రాజ్ ప్రకటించారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











