నాని, వేణు యెల్దండి కాంబో మూవీకి టైటిల్ ఫిక్స్.. ఫ్లోలో రివీల్ చేసిన దిల్‌రాజు!

నాచులర్ స్టార్ నాని గురించి ఆయన నటన గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటనను కనబరుస్తూ... కాదు కాదు జీవిస్తూ అందరికీ దగ్గరైన ఈయన హాయ్ నాన్న తర్వాత మరో సినిమాకు ఓకే చెప్పారు. ముఖ్యంగా బలగం ఫేమ్ డైరెక్టర్ వేణు యెల్దండితో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు ఓ సరికొత్త టైటిల్ ను ఫిక్స్ చేశారు. తాజాగా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేశారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ యంగ్ హీరోగా కొనసాగుతున్న నాచురల్ స్టార్ నాని.. ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. డిసెంబర్ 7వ తేదీన విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీగానే వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా తర్వాత నాని.. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చేసుకుంటున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరిలు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Producer Dilraju Revealed Natural Star nani And Venu Yeldandi Combo Movie Title Check Details

ఇక ఈ సినిమా తర్వాత నాని నాని బలగం ఫేమ్ డైరక్టర్ వేణు యెల్దండితో కలిసి ఓ సినిమా చేయనున్నారు. అయితే ఇప్పటికే వేణు ఈ సినిమాకు సంబంధించిన కథను చెప్పగా.. నానికి నచ్చి ఓకే చెప్పారు. అయితే ఈ సినిమాను దిల్ రాజు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఆయన.. లవ్ మీ టీజర్ రిలీజ్ ఫంక్షన్ కు వచ్చారు. ఈక్రమంలోనే మీడియా వాళ్లు ఆయన చుట్టూ చేరి.. వేణు యెల్దండి, నాని సినిమాల సినిమా గురించి అడిగారు.

అయితే ఫ్లోలో.. దిల్ రాజు నాని, వేణు యెల్దండి సినిమా టైటిల్ ను రివీల్ చేశారు. వీరిద్దరి కాంబో మూవీ "యెల్లమ్మ" త్వరలో రాబోతుందని.. చెప్పుకొచ్చారు. ఈ సినిమా ఫైనల్ అయిందని.. త్వరలోనే వస్తుందని వివరించారు. ఇప్పటికే ఈ సినిమా పేరు యెల్లమ్మ అని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ తొలిసారి దిల్ రాజ్ ఈ సినిమా టైటిల్ ఇదేనని ఫిక్స్ చేయడంతో అంతా కన్ఫార్మ్ అయిపోయారు. త్వరోలనే నాని, వేణుల సినిమా నుంచి అప్ డేట్ రాబోతుందని సమాచారం. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X