Dilraju: విజయ్‌ను స్టార్‌గా చూపించాలని కాదు.. ఫ్యామిలీ స్టార్ టైటిల్ వెనుక అసలు కథ అదేనట!
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా టీఎఫ్ జేఏ ఈవెంట్ కు హాజరు అయిన దిల్ రాజు ఓ అదిరిపోయే న్యూస్ చెప్పారు. ముఖ్యంగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా రాబోతున్న తాజా సినిమా ఫ్యామిలీ స్టార్ టైటిల్ వెనుక అసలు కథను వివరించారు. ఆ టైటిల్ ను విజయ్ దేవరకొండను స్టార్ గా చూపించాలని పెట్టలేదని క్లారిటీ ఇచ్చారు. ఎందుకు పెట్టారో చెప్పి అందరినీ ఇంప్రెస్ చేశారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా రాబోతున్న తాజా సినిమానే "ఫ్యామిలీ స్టార్". అయితే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా కనిపించబోతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై.. దిల్ రాజు, వాసువర్మ, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే గోపి సుందర్ సంగీతం ఈ సినిమాకు అందిస్తుండగా.. కె యు మోహనన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్లు, పాటలకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇటీవలే వచ్చిన టీజర్ అయితే మరింత ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఈక్రమంలోనే చిత్రబృందం కూడా ప్రమోషన్లు చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న దిల్ రాజు తాజాగా టీఎఫ్ జేఏ ఈవెంట్ కు హాజరు అయ్యాడు. అక్కడ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు.
ముఖ్యంగా విజయ్ దేవరకొండ హీరోగా రాబోతున్న ఫ్యామిలీ స్టార్ సినిమా టైటిల్ వెనుక ఉన్న అసలు కథను తొలిసారి రివీల్ చేశారు. అయితే అంతా అనుకున్నట్లుగా ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ ను.. విజయ్ దేవరకొండను స్టార్ గా చూపించడానికి పెట్టలేదని క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత తాము ఈ టైటిల్ ఫిక్స్ ఎందుకు చేశారో వెల్లడించారు.

ఎక్కడో ఉన్న మీ కుటుంబాలని పైకి తీసుకొస్తూ.. కుటుంబాన్ని ఎక్కడికో తీసుకువెళ్లిన వాళ్లందరూ ఫ్యామిలీ స్టార్స్ యే అని.. అలాంటి వాళ్లందరి కోసమే ఈ టైటిల్ ఫిక్స్ చేసినట్లు దిల్ రాజు తెలిపారు. దిల్ రాజు బ్రాండ్ ఫ్యామిలీ సినిమా వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో.. ఈ సినిమా కూడా అచ్చం అలాగే ఉంటుందని వివరించారు. ముఖ్యంగా జనాలు అందరిలోనూ ఫ్యామిలీ స్టార్స్ ఉంటారని చెప్పారు. ఏప్రిల్ 5వ తేదీన రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఏ రేంజ్ లో బాక్సాఫీసును షేక్ చేస్తుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











