RRR అభిమానులకి బ్యాడ్ న్యూస్.. విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

ఇండియన్ బిగ్గెస్గ్ మల్టీస్టారర్ మూవీ RRR సినిమా మొదలైనప్పటి నుంచి ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు తెరపైకి వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దర్శకుడు రాజమౌళి సాధారణంగా ఎలాంటి సినిమా చేసినా అంత ఈజీగా ఫినిష్ చేయడని అందరికి తెలిసిందే. ఆయన తీసుకునే సమయం ఏడాది నుంచి మూడేళ్ళ వరకు ఉంటుందని సినిమా రిలీజ్ అయ్యేవరకు తెలియదు. ఇక ఫైనల్ గా RRR విషయంలో కూడా అనుకున్నదే జరుగుతోంది.

మోసం చేసిన రాజమౌళి

మోసం చేసిన రాజమౌళి

జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించబోతున్నారు అన్నప్పటి నుంచి అభిమానుల్లో ఒకే ఒక్క ప్రశ్న కలవరపెడుతోంది. రాజమౌళి చెప్పిన డేట్ కి సినిమాను రిలీజ్ చేస్తాడా అని అనేక రకాల సందేహాలు వెలువడ్డాయి. అసలైతే మొదట చెప్పిన డేట్ ప్రకారం సినిమా జులై 31న రిలీజ్ కావాల్సింది. ఆ తరువాత దసరా అన్నారు. ఇక ఫైనల్ గా మరో డేట్ చెప్పి జక్కన్న మోసం చేశాడు.

సంక్రాంతికి లేనట్లే..

సంక్రాంతికి లేనట్లే..

సినిమా మొదలైనప్పుడు అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం షూటింగ్ పూర్తయ్యి ఉంటే ప్రస్తుతం చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉండేది. ఇక ఇప్పుడు లాక్ డౌన్ ఎఫెక్ట్ తో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమా మరింత ఆలస్యంగా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దర్శకుడు రాజమౌళి కూడా ఈ విషయంపై సరైన క్లారిటీ ఇవ్వలేకపోయారు.

 బ్యాడ్ న్యూస్ చెప్పిన నిర్మాత

బ్యాడ్ న్యూస్ చెప్పిన నిర్మాత

RRR నిర్మాత డివివి.దానయ్య ఫైనల్ గా సినిమా రిలీజ్ డేట్ పై ఫైనల్ క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుకున్న సమయానికి RRR ని విడుదల చేయలేమని అన్నారు. ఈ చిత్రాన్ని 2021 జనవరి 8న రిలీజ్ చేయాలని అనుకున్నాము. కానీ ఇంకా షూటింగ్ పనులు అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉండడం వలన అనుకున్న సమయానికి విడుదల చేయలేమని దానయ్య తెలిపారు.

Recommended Video

Mia Malkova's Climax Teaser Is Out | RGV | GST
స్పెషల్ డేట్..

స్పెషల్ డేట్..

కరోనా కారణంగా ముందు రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి సినిమా షూటింగ్స్ కి కూడా పలు అంతరాయలు ఏర్పడవచ్చు. అందుకే RRR పనులు పూర్తవ్వడానికి మరికొంత సమయం పట్టవచ్చు. అయితే ఫైనల్ గా సినిమాను సమ్మర్ లోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. స్పెషల్ డేట్ ఏప్రిల్ 28ని ఫిక్స్ చేసే ఛాన్స్ ఉందట. అదే తేదీన బాహుబలి 2 విడుదలైన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X