త్రిష వల్ల నా జీవితం అలా నాశనం’ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్
ఒకప్పుడు తెలుగు చిత్రసీమలో అగ్ర హీరోయిన్ గా చక్రం తిప్పింది చెన్నై బ్యూటీ త్రిష. టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అమ్మడు అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకలను కట్టిపడేసింది. ఇప్పటికీ అదే అందం, అభినయంతో సౌత్ లో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతుంది. 20 ఏళ్ళ సినీ కెరీర్ లో ఎన్నో మరపురాని సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది త్రిష. అయితే.. తాజాగా ఓ నటి త్రిషపై నాయకి నిర్మాత గిరిధర్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల నిర్మాత గిరిధర్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. 'నటి త్రిషతో తాను ఓ సినిమా తీయాలని నిర్ణయించుకున్నా.. థ్రిల్లర్ మూవీ చేయమంటే నో చెప్పింది. ఆ సమయంలో డైరెక్టర్ గోవర్థన్ రెడ్డి ఓ కథతో వచ్చారు. అదే నాయకి స్టోరీ. ఆ స్టోరీ విని వెంటనే ఓకే చెప్పింది నటి త్రిష.
వెంటనే నాయికి. చాలా ఊషారుగా మొదలైంది. కానీ, మధ్యలోనే కష్టాలు మొదలయ్యాయి. సంపాదించిదంతా.. తీసుకెళ్లి సినిమాపై పెట్టాను. ఎక్కడ లాస్ రాకూడదని ఇటు తెలుగు అటూ తమిళ వర్సెన్ తో తీశాను. కానీ నష్టపోయా.. అప్పడు అర్థమైంది.. తెలియని భాషలో అస్సలు సినిమాలు తీయకూడదు'అని నిర్మాత గిరిధర్ అన్నారు.

నిర్మాత గిరిధర్ ఇంకా మాట్లాడుతూ.. 'నాయికి మూవీ వల్ల తనకు, త్రిషకు ఉన్న రిలేషన్ చెడిపోయింది. అది కేవలం డైరెక్టర్ వల్లే.. సినిమా 10 కోట్లు చేరిందనీ డైరెక్టర్ చెప్పడం, కానీ ఇక్కడ అంత మ్యాటర్ లేకపోవడం. రెమ్యూనరేషన్ ప్రకారం తేడా వచ్చింది. నేను తమిళ సాటిలైట్ రైట్స్ ఇద్దామనుకుంటే.. త్రిష మాత్రం కోటీ రూపాయాలైన ఇవ్వాలని డిమాండ్ చేయడం. ఇలా ఇబ్బందిపడ్డాను' అని నిర్మాత గిరిధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు .
మన సినిమా ఫేత్ ఆర్టిస్టులు చేసిన ముందు సినిమాపై ఆధారపడి ఉంటుంది. నాయకి సినిమా రీలిజ్ కాకముందే త్రిష హర్రర్ మూవీ చేసింది. ఆ మూవీ నాయకి కంటే.. ముందుకు రావడం.. ఆ మూవీ ప్లాప్ కావడం ఆ మూవీ ఎఫెక్ట్ నా సినిమా పై పడింది. అలాగే షెడ్యూల్ ప్రకారం తెలుగు, తమిళ్ ల్లో ఒకే సారి రీలిజ్ చేద్దామని ప్లాన్ చేశాం. కానీ సెట్ కాలేదు. దీంతో తెలుగులో ఫస్ట్.. ఆ తరువాత తమిళ్ లో తరువాత రీలిజ్ చేశాం. ఓ క్షణం మన జీవితాన్ని మార్చేస్తుందన్నట్టు.. నాయికి సినిమా తీయాలనుకోవడం. నా జీవితాన్నే మార్చివేసింది'అని షాకింగ్ కామెంట్స్ చేశారు నాయకి సినిమా ప్రొడ్యూసర్ గిరిధర్.

ఇదిలా ఉంటే.. దళపతి విజయ్ 'గోట్' చిత్రంలో నటి త్రిష కృష్ణన్ అతిధి పాత్రలో నటించింది. ఆమె ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాట కోసం విజయ్‌తో జతకట్టినట్టు సమాచారం. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వినాయక చతుర్థి పండుగ కానుకగా సెప్టెంబర్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ప్రశాంత్, ప్రభుదేవా, లైలా, జయరామ్, స్నేహ, అజ్మల్ అమీర్, వైభవ్, ఇతర ప్రముఖ పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











