Baahubali 3: బాహుబలి 3 వస్తుందా? రాదా? .. నిర్మాత క్లారిటీ..

Baahubali 3: భారతీయ చలనచిత్ర ముఖచిత్రాన్ని మార్చేసిన సినిమా బాహుబలి. ఈ మూవీ క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్ని కాదు. బాహుబలి, బాహుబలి-2 మూవీస్ ఇండియన్ సినిమా రేంజ్ నే మార్చిపడేశాయి. బహుబలి సీరిస్ వల్లే యావత్ ప్రపంచం చూపు ఇండియన్ సినిమాలపై పడిందంటే అతిశయోక్తి కాదు. మరి ముఖ్యంగా తెలుగు సినిమాల స్థాయి కూడా పెరిగింది. అంతలా ఇంపాక్ట్ చేసిన ఈ సినిమాలకు మరో సీక్వెల్ మూవీ ఉంటుందా? అనే విషయంపై తాజాగా ఓ నిర్మాత క్లారిటీ ఇచ్చాడు.

దర్శక ధీరుడు రాజమౌళి.. బాహుబలి మూవీస్ తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారు. అప్పటివరకు తెలుగు సినిమా అంటే డౌన్ పాల్ మూవీస్ గా భావించేది బాలీవుడ్. రీమిక్స్ సైతం తెలుగు సినిమాలను నెత్తిన పెట్టుకున్నారంటే అది బాహుబలి మూవీ ఘనతే. ఈ మూవీ కలెక్షన్ల పరంగా కూడా ఎన్నో రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఈ మూవీ భారీ విజయంతో పాటు కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసిందనే సంగతి తెలిసిందే.

producer KE Gnanavel Raja reveals That Prabhas-SS Rajamouli s Baahubali 3 in the works

అలాగే..ఈ మూవీ హిట్ తోనే యంగ్ రెబల్ స్టార్.. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. వరుసగా.. పాన్ ఇండియా మూవీ చేస్తూ బిజీబిజీగా మారారు. ఇప్పట్నుంచే ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ షూటింగ్ లో బిజీబిజీగా ఉన్నారు. అలాగే.. హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ఫౌజీ షూటింగ్ కి కూడా రెడీ అయ్యాడు. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో అధికారకంగా ప్రారంభమయ్యింది. ప్రభాస్ అప్ కమింగ్ ప్రాజక్ట్స్ లో స్పిరిట్ కూడా ఒకటి. ఈ మూవీ సన్సెషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కబోతుంది.

ఇక రాజమౌళి విషయానికి వస్తే.. అనంతరం ఆర్​ఆర్​ఆర్​, ప్రస్తుతం ప్రిన్స్ మహేశ్ బాబు (SSSMB 29)తో బిజీ అయిపోయారు. ఈ మూవీ షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రి ప్రోడక్షన్ పనులు మొత్తం పూర్తి అయిపోయినట్టు టాక్. ఈ తరుణంలో బాహుబలి 3 మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెగ వైరల్ అవుతుంది.

producer KE Gnanavel Raja reveals That Prabhas-SS Rajamouli s Baahubali 3 in the works

ప్రస్తుతం కంగువా ప్రమోషన్స్​లో(Kanguva Promotions) భాగంగా కోలీవుడ్‌ నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. బహుబలి మూవీ పార్ట్ 3 పై ఆసక్తికర కామెంట్స్​ చేశారు. బాహుబలి రెండు భాగాలకు తమిళంలో నిర్మాతగా జ్ఞానవేలే వ్యవహరించిన విషయం తెలిసిందే.

కేఈ జ్ఞానవేల్‌ మాట్లాడుతూ.. గతవారమే బాహుబలి మేకర్స్‌తో చర్చించాననీ, బహుబలి మూడో భాగం తీసే ప్లాన్‌ లో ఉన్నారన్నారు. కానీ, దాని కన్నా ముందు రెండు సినిమాలు ఉన్నాయనీ, ప్రభాస్ 'కల్కి-2', 'సలార్-2' మూవీస్ తరువాతే 'బాహుబలి-3' ప్లాన్ చేస్తారని జ్ఞానవేల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాహుబలి - 3 కోసం వెయిటింగ్‌ అంటూ ప్రభాస్‌ అభిమానులు తెగ పోస్టులు పెడుతున్నారు. మహేశ్ బాబు మూవీ తరువాత రాజమౌళి బాహుబలి 3 పనులు మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X