For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇప్పటి హీరోయిన్లకు డబ్బే లోకం... మూవీని పట్టించుకోరు.. నయనతార పేరెత్తి స్టార్ నిర్మాత షాకింగ్ కామెంట్స్

  |

  ఈ కామెంట్స్ చేసింది చిన్నాచితక నిర్మాత అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ కామెంట్స్ వరల్డ్ ఫేమస్ లవర్, బుజ్జిగాడు, దమ్ము లాంటి భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించిన స్టార్ నిర్మాత కేఎస్ రామారావు. ఇప్పటి తరం వాళ్ళకు ఈ సినిమాల పేరు చెప్తే గుర్తు పడతారు. కానీ 1983లో అభిలాష సినిమాతో మొదలైన ఆయన ప్రస్థానంలో బాబాయ్ హోటల్, మాతృదేవోభవ, చంటి లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు. అయితే తాజాగా ఆయన హీరోయిన్స్ మీద ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యాయి.

  బ్రాలో అందాలను ఆరబోసిన హీనా పంచల్.. బికినీలో అదరగొట్టిన యువ హీరోయిన్

  మెగాస్టార్ చిరంజీవికి ఎన్నో హిట్స్ అందించి

  మెగాస్టార్ చిరంజీవికి ఎన్నో హిట్స్ అందించి


  మెగాస్టార్ చిరంజీవి కెరీర్ స్టార్టింగ్ లో అభిలాష, చాలెంజ్, రాక్షసుడు, మరణ మృదంగం, స్టువర్ట్పురం పోలీస్స్టేషన్ ఇలా వరుస సినిమాలు చిరంజీవితో నిర్మించి అనేక హిట్స్ అందుకున్నారు రామారావు. 83లో అభిలాష సినిమా మొదలుకొని 2020లో విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా దాకా ప్రమోద ఆర్ట్స్ బ్యానర్ అలాగే కేఎస్ఆర్ క్రియేషన్స్, క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్స్‌ ఇలా దాదాపు మూడు బ్యానర్స్ లో కలిపి ఎన్నో హిట్ సినిమాలు అందించారు.

  ప్రేక్షకులకి కర్చీఫ్ లు ఇచ్చి

  ప్రేక్షకులకి కర్చీఫ్ లు ఇచ్చి

  ఆయన నిర్మించిన సినిమాల్లో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాతృదేవోభవ సినిమా గురించి. ఈ సినిమా చూస్తూ ఏడవకుండా ఉన్న ప్రేక్షకుడు ఉండడు అనడంలో అతిశయోక్తి లేదు. సినిమా చూడడానికి వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి అప్పట్లో థియేటర్ యాజమాన్యం కర్చీఫ్ ఇచ్చి లోపలికి పంపే వారు అంటే ఈ సినిమా ఎంతలా ఏడిపించేసి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మాధవి హీరోయిన్ గా దర్శకుడు అజయ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా గురించి మాట్లాడుతూ కె.ఎస్.రామారావు హీరోయిన్ ల మీద కీలక వ్యాఖ్యలు చేశారు.

  రీమేక్ చేయాలని అభిలాష

  రీమేక్ చేయాలని అభిలాష

  తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ సినిమాని ఇప్పుడు రీమేక్ చేయాలని ఉందనే అభిలాషను బయటపెట్టారు. మాతృత్వంలో ఉన్న మాధుర్యాన్ని చూపించి కంటతడి పెట్టించిన ఈ సినిమాను ఇప్పటి తరం ప్రేక్షకులకు కూడా చూపించాలని ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు వస్తున్న కథలు ఇంతకన్నా గొప్పగా ఏమీ లేవని చెబుతూ ఇలాంటి సినిమాను టీవీలో చూపించడం కాకుండా ఇప్పటి తరం వారికి ఇప్పటి నటీనటులతో మరోసారి చూపించాలని ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

  నయనతార కరెక్ట్

  నయనతార కరెక్ట్

  అంతే కాక ప్రతి రోజు ఈ సినిమా రీమేక్ గురించి ఆలోచిస్తూ ఉంటాను అని దర్శకుడు అజయ్ తో కూడా ఇదే విషయాన్ని చెబుతూ ఉంటాను అని ఆయన గుర్తు చేస్తుకున్నారు. అయితే ఈ రోజుల్లో ఈ సినిమాని రీమేక్ చేయాలంటే నయనతార, అనుష్క, కీర్తి సురేష్ లాంటి వాళ్ళతో చేయాలని ఆయన చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా నయనతారతో ఈ సినిమా చేస్తే ఆ ఇంపాక్ట్ ఇంకా బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

  రెమ్యునరేషన్ వింటే భయమేస్తోంది

  రెమ్యునరేషన్ వింటే భయమేస్తోంది

  అయితే ఇదే సమయంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి పరిస్థితుల్లో తక్కువ బడ్జెట్ తో ఈ సినిమా తీసే ప్రయత్నం కష్టమేనని చెప్పుకొచ్చారు. ఆ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ వింటేనే భయపడే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. నయనతార రెమ్యునరేషన్ వింటే ఆమెతో సినిమా చేయడం కష్టమేనని ఆయన అన్నారు అలాగే ఇప్పటి జనరేషన్ హీరోయిన్లు కధల కంటే ఎక్కువగా రెమ్యునరేషన్ కి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అంతేగాక నయనతార ప్రమోషన్స్ కి రాదు అని నిర్మాతల నుంచి ఒక కంప్లైంట్ వినిపిస్తూ ఉంటుంది. ఆ అంశాన్ని కూడా రామారావు ప్రస్తావించారు. దర్శక నిర్మాతలతో పాటు నటీనటులు కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటే సినిమాకు మరింత బూస్ట్ వస్తుందని ఆయన పరోక్షంగా చెప్పుకొచ్చారు.

  English summary
  Matrudevobhava is one of the cult classic films in the Telugu film industry. After 30 years of release, producer KS Rama Rao wants to remake it again with the same director, Ajay Kumar. In a recent interview with a youtube channel he conveyed his wish to make a remake.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X