భార్యకు విడాకులు.. ఆమెతో రెండో పెళ్లి, 50 ఏళ్ల వయసులో తండ్రైన టాలీవుడ్ నిర్మాత

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పెళ్లిళ్లు, ప్రేమలు, ఎఫైర్స్, డేటింగ్, విడాకులు, ప్రెగ్నెన్సీ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సెలబ్రిటీలు ఒకరి తర్వాత మరొకరు గుడ్‌న్యూస్ చెబుతున్నారు. మరికొందరు ఇదే దారిలో ఉన్నారు. తాజాగా టాలీవుడ్‌కు చెందిన నిర్మాత 50 ఏళ్ల వయసులో తండ్రి అయ్యాడు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కజిన్ మధు మంతెన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హైదరాబాద్‌కు చెందిన మధు.. వర్మ అడుగుజాడల్లోనే సినీరంగం వైపు అడుగులు వేసిన ఆయన.. నిర్మాత కావాలని అనుకున్నారు. దీనిలో భాగంగా బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ హీరోగా ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో గజినీని నిర్మించి సూపర్‌హిట్ అందుకున్నారు. ఆ తర్వాత క్వీన్, లూటేరా, ఉడ్తా పంజాబ్, సూపర్ 30, రక్త చరిత్ర, రామన్ రాఘవ్ 2.0, హైజాక్ తదితర సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించారు.

producer Madhu Mantena Becomes Father at 50 Welcomes Baby Boy with Ira Trivedi

తొలినాళ్లలో బెంగాల్‌ నటి, మోడల్, రచయిత అయిన నందనా సేన్‌తో మధు మంతెన దాదాపు 10 ఏళ్లపాటు డేటింగ్ చేశారు. అయితే అనివార్య కారణాలతో ఈ జంట విడిపోయింది. ఈ క్రమంలో బాలీవుడ్ దిగ్గజ నటి నీనా గుప్తా కుమార్తె మసాబా గుప్తాను 2105లో పెళ్లాడారు మధు. అయితే మనస్పర్థల కారణంగా వీరిద్దరూ నాలుగేళ్లు తిరిగేసరికి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మోడల్, యోగా టీచర్ ఐరా త్రివేదితో ప్రేమలో పడిన ఆయన 2023 జూన్ 11న ఆమెను పెళ్లాడారు. అమీర్ ఖాన్, హృతిక్ రోషన్ సహా పలువురు బాలీవుడ్ తారలు వీరి వివాహానికి హాజరయ్యారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఐరా త్రివేది- మధు మంతెనల పెళ్లి జరిగింది.

ఈ క్రమంలో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు మధు మంతెన- ఐరా త్రివేదిలు ఈ ఏడాడి జనవరి 15న తెలియజేశారు. ఈ మేరకు భార్య బేబీ బంప్ ఫోటోలను ఆయన షేర్ చేశారు. డెలివరీ డేట్ దగ్గరపడటంతో ఐరా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలో మార్చి 22 తెల్లవారుజామున పండంటి మగబిడ్డకు ఐరా జన్మనిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు.. మధు మంతెన, ఐరా త్రివేది దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఐరా త్రివేది కుటుంబం ఉత్తరప్రదేశ్‌కు చెందినది. ఆమె అమ్మమ్మ క్రాంతి త్రివేది హిందీలో ప్రముఖ రచయిత్రలలో ఒకరు. ఈమె తండ్రి పండిట్ రవిశంకర్ శుక్లా.. మధ్యప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి. హిందీలో ఎన్నో పుస్తకాలు రాసిన క్రాంతి త్రివేది అక్టోబర్ 26, 2009లో కన్నుమూశారు. ఆమె జ్ఞాపకార్థం కేంద్ర ప్రభుత్వం 2010లో పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. ఇక అమ్మమ్మ బాటలోనే ఐరా త్రివేది సైతం పలు పుస్తకాలు రాయడంతో పాటు కాలమిస్ట్‌గా ప్రముఖ పత్రికలు, వెబ్ పోర్టల్స్‌కు వ్యాసాలు రాశారు. శివానంద యోగా వేదాంత సెంటర్ నుంచి యోగాలో ఆచార్య ట్రైనింగ్ పూర్తి చేశారు ఐరా. 2017లో బీబీసీ విడుదల చేసిన ప్రపంచంలో 100 మంది ప్రభావశీల మహిళల్లో ఒకరిగా ఐరా త్రివేది స్థానం సంపాదించారు.

Read more about: madhu mantena ira trivedi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X