twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డ్రగ్ కేసులో టాలీవుడ్ నిర్మాత‌ విచారణ పూర్తి.. 7 గంటలపాటు ఏకధాటిగా ప్రశ్నల వర్షం

    |

    బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కేసులో ఎన్సీబీ అధికారులు నిర్మాత మధు మంతెనను బుధవారం సుధీర్ఘంగా విచారించారు. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జయ సాహాతోపాటు మధు మంతెనను కలిపి ఎదురెదురుగా విచారించినట్టు తెలిసింది. వీరిద్దరూ కూడా క్వాన్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీతో అనుబంధం ఉన్నావారే కావడంతో పలు కోణాల్లో విచారణ చేపట్టారు. క్వాన్ టాలెంట్ మేనేజ్‌‌మెంట్ పనులు కాకుండా ఎక్కువగా డ్రగ్స్ దందాపైనే దృష్టిపెట్టిందనే ఆరోపణలు వెలుగులోకి వచ్ాచయి.

    ఎన్సీబీ సమన్లు జారీ చేయడంతో దక్షిణ ముంబైలోని ఎన్సీబీ గెస్ట్‌హౌజ్‌కు మధు మంతెన మధ్యాహ్నం 11.30 గంటలకు చేరుకొన్నారు. సుదీర్ఘంగా సాగిన విచారణ అనంతరం ఆయన సుమారు 6.30 గంటల ప్రాంతంలో ఎన్సీబీ కార్యాలయాన్ని వదిలి వెళ్లారు.

    Producer Madhu Mantena grilled for 7 hours by NCB in drug case nexus

    డ్రగ్స్ కేసులో జయా సాహాను గత రెండు రోజులుగా విచారిస్తున్నారు. బుధవారం మధు మంతెనను విచారణకు పిలుస్తూ సమన్లు జారీ చేశారు.

    మధు మంతెన విషయానికి వస్తే.. టాలీవుడ్, బాలీవుడ్‌లో పలు చిత్రాలను నిర్మించిన ఆయన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు సమీప బంధువు. హిందీలో నిర్మాత అల్లు అరవింద్‌తో కలిస గజిని సినిమాను, ఆ తర్వాత రన్ చిత్రాన్ని రూపొందించారు. బెంగాళీలో ఆటోగ్రాఫ్, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రక్త చరిత్ర చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత జూటా హై సహీ, మౌసమ్ అనే చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

    English summary
    Telugu producer Madhu Mantena NCB in alleged Bollywood-drug racket nexus. He will attend on September 23rd before NCB questioned. He was the producer of Gajini and Rakta Charitra. He is close relative to Director Ram Gopal Varma.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X