గంగోత్రిలో అల్లు అర్జున్ లుక్ .. కన్నకొడుకు పైనే అరవింద్ జోకులు.. స్టార్ ప్రొడ్యూసర్ సంచలనం
మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి హీరోగా వచ్చి టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా , ఐకాన్‌స్టార్‌గా వెలుగొందుతున్నారు అల్లు అర్జున్. ఈ స్టార్‌డమ్ ఆయనకు ఫ్రీగా ఏం రాలేదు.. తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, మెగా బ్రాండ్ అనేది కేవలం లాంచింగ్ వరకు మాత్రమే ఉపయోగపడింది. తొలి సినిమా తర్వాతి నుంచి తన కష్టం, శ్రమ, ప్రతిభతోనే జాతీయ ఉత్తమ నటుడిగా ఎదిగారు అల్లు అర్జున్. అయితే బన్నీ కెరీర్‌పై స్వయంగా ఆయన తండ్రి అల్లు అరవింద్ సైతం ఒకదశలో టెన్షన్ పడ్డారట.
దిగ్గజ హాస్య నటుడు అల్లు రామలింగయ్య గారి మనవడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని అల్లు అర్జున్ అనుకున్నారు. బాలనటుడిగా నటించడంతో పాటు డాడీలో గెస్ట్ రోల్ ద్వారా ప్రేక్షకులను పలకరించారు. చిన్నప్పుడే అల్లు అర్జున్‌లోని టాలెంట్‌ని గుర్తించిన వ్యక్తి దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు. ఓసారి చిరంజీవి బర్త్ డే నాడు ఆయన నివాసానికి వెళ్లిన రాఘవేంద్రరావుకు పిల్లలు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. వీరిలో అల్లు అర్జున్ కూడా ఉన్నారట. చిన్నారి బన్నీని, అతని డ్యాన్స్‌ని చేసిన పెద్దాయనకి ముచ్చటేసింది.

ఈ బాబు పెద్దయ్యాక ఖచ్చితంగా పెద్ద స్టార్ హీరో అవుతాడని ఆశీర్వదించారు రాఘవేంద్రరావు. అలాగే 100 రూపాయలు చేతిలో పెట్టారట. ఈ విషయాన్ని రాఘవేంద్రరావు మరిచిపోయారు.. అయితే అల్లు అర్జున్ మాత్రం ఆ 100 రూపాయలను అపురూపంగా దాచుకున్నాడట. అయితే అల్లు అర్జున్‌ను రాఘవేంద్రరావే తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన గంగోత్రి సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు బన్నీ. ఆ తర్వాతి నుంచి ఇక వెనుదిరిగి చూసుకోలేదు అల్లు అర్జున్.
అయితే గంగోత్రిలో నటన, డ్యాన్స్, ఫైట్స్‌లో ఇరగదీసిన అల్లు అర్జున్ లుక్ పరంగా మాత్రం పలు విమర్శలు ఎదుర్కొన్నారు. ఇది ఆయన తండ్రి అల్లు అర్జున్‌ను బాగా ఇబ్బంది పెట్టినట్లు తెలిపారు సీనియర్ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన గంగోత్రి నాటి విషయాలు పంచుకున్నారు. రాఘవేంద్రరావు తన మార్క్ ప్లానింగ్, డ్యాన్స్‌లు, పాటలతో గంగోత్రిని హిట్ చేశారని.. నటన పరంగా అల్లు అర్జున్‌కు ఈ చిత్రంలో వంక పెట్టడానికి ఏం లేదని సత్యనారాయణ అన్నారు.
గంగోత్రి తర్వాత ఎలాంటి సినిమా తీయాలి? ఏ కథతో వెళ్లాలని అల్లు అరవింద్ ఆందోళనకు గురయ్యారట. ఈ క్రమంలో సుకుమార్, దిల్‌రాజుతో కలిసి ఆర్య కథ పట్టుకుని అరవింద్ దగ్గరికి వెళ్లారట. అయితే ఈ కథపై అరవింద్ అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదట. కానీ తాను ఆర్య కథను విని ఇది అల్లు అర్జున్‌కు సెట్ అవుతుందని చెప్పానని.. అయితే ఇప్పటికే తాము కథను అల్లు అరవింద్‌కు వివరించినట్లు సుక్కు, రాజు చెప్పారు.
అల్లు అరవింద్‌ను తాను ఒప్పిస్తానని చెప్పి.. ఓ రోజున హైదరాబాద్‌కు ఇద్దరం కారులో వస్తుండగా ఆర్య గురించి డిస్కస్ చేశారట సత్యనారాయణ రెడ్డి. అల్లు అర్జున్ పీలగా ఉంటాడని, హీరోగా ఏం సెట్ అవుతాడోనని తన ముందే జోకులు వేశాడని ఆ మాటలతో తాను షాకైనట్లు తెలిపారు. తర్వాత అల్లు అరవింద్‌ను ఒప్పించి ఆర్య ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించగా.. ఈ సినిమా సూపర్‌హిట్ అయినట్లు సత్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











