TTD టాలీవుడ్ నిర్మాత మోహన్ ముళ్లపూడికి టీటీడీ అరుదైన గౌరవం!
తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నిర్మాత మోహన్ ముళ్లపూడికి అరుదైన గౌరవం దక్కింది. కలియుగ పుణ్యక్షేత్రంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామికి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలక పదవిని ఆయనను వరించింది. శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాలకు చెందిన లోకల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా ఆయనను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్, కరీంనగర్‌లోని టీటీడీ ఆలయాలకు సంబంధించిన వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారు అని ఈవో తన ప్రకటనలో తెలిపారు.
మోహన్ ముళ్లపూడి విషయానికి వస్తే.. తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతగా, డిస్టిబ్యూటర్‌గా పలు సినిమాలకు వ్యవహరించారు. గతంలో ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ (FNCC)కు గౌరవ కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం గౌరవ హోదాలో టీటీడీ ఆలయాల అభివృద్ధి కోసం సేవలందిస్తారు. అలాగే కరీంనగర్‌లో నిర్మిస్తున్న ఆలయ పనుల బాధ్యతలను స్వీకరిస్తారు అని ఈవో ప్రకటనలో తెలిపారు.

నిర్మాత మోహన్ ముళ్లపూడికి టీటీడీలో కీలక బాధ్యతలు అప్పగించడంపై సినీ వర్గాలు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలిపారు.


Click it and Unblock the Notifications











