ఒక్కడు 2: మరోసారి క్లారిటీ ఇచ్చిన నిర్మాత..
సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ జీవితంలో ఆల్ టైమ్ బెస్ట్ మూవీస్ లో 'ఒక్కడు' చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్ చేసిన ఆ సినిమా ఇతర భాషల్లో కూడా రీమేక్ అయ్యి ఘన విజయాన్ని అందుకుంది. మహేష్ కెరీర్ మొదట్లో నమ్మకం పెట్టుకున్న కొన్ని సినిమాలు ఊహించని విదంగా దెబ్బ కొట్టాయి. అయితే కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా మాత్రం ఒక్కడు. అయితే గత కొంతకాలంగా ఆ సినిమాకు సీక్వెల్ కూడా రెడీ అయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా రూమర్స్ వస్తున్నాయి. ఇక నిర్మాత యంఎస్.రాజు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు.
సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్షన్ లో మహేష్ చేసిన సినిమాలు ఒక్కడు, సైనికుడు, అర్జున్. అందులో ఒక్కడు మాత్రమే బాక్సాఫీస్ వద్ద ఒక ట్రెండ్ సెట్ చేసింది. సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఇక ఆ సినిమా తరువాత మహేష్ అగ్ర హీరోల జాబితాలోకి చేరాడు. యంఎస్.రాజు ఆ సినిమా నిర్మించిన విషయం తెలిసిందే.

ఇక 17 ఏళ్ళ తరువాత సినిమాకు సంబంధించిన సీక్వెల్ పై చర్చలు మొదలైనట్లు టాక్ వస్తున్న సమయంలో నిర్మాత యంఎస్.రాజు క్లారిటీ ఇచ్చిన విధానంతో అభిమానుల్లో ఆశలు చిగురించాయి. ఇటీవల సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేసిన నిర్మాత రాజుగారు ఒక విషయమైతే గట్టిగానే చెప్పారు. కథ సెట్టయితే తప్పకుండా ఒక్కడు 2 ఉంటుందని అంటూ.. ఆ సినిమాను గుణశేఖర్ ద్వారానే మళ్ళీ తెరకెక్కుతుందని కూడా అన్నారు. అయితే తప్పకుండా త్వరలోనే మహేష్ బాబుతో మాత్రం ఒక సినిమా అయితే చేస్తానని వివరణ ఇచ్చారు యంఎస్.రాజు


Click it and Unblock the Notifications











