త్రివిక్రమ్ తో ప్రభాస్ సినిమా.. అప్పటి నుంచి ప్రయత్నాలు: నిర్మాత క్లారిటీ

టాలీవుడ్ రెబల్ స్టార్ తో సినిమా చేయాలి అని దర్శకుడు నిర్మాతలు చాలామంది ఇప్పటికీ కూడా ఎదురుచూస్తున్నారు. రెండేళ్ల తర్వాత అయినా సరే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ఇప్పుడే ప్రభాస్ కు అడ్వాన్స్ లు కూడా ఇవ్వడానికి పలువురు సిద్ధమయ్యారు. అయితే ప్రభాస్ మాత్రం ముందుగా అనుకున్న ప్రాజెక్టులను పూర్తి చేసుకొని ఆ తర్వాత వేరే కథలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. అయితే ఎప్పటినుంచో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా ప్రభాస్ సినిమా చేయాలని అనుకుంటున్నాడు.

త్రివిక్రమ మనసులో కూడా అదే ఉంది. కానీ వీరి కలయికకు సరైన సమయం అయితే కుదరడం లేదు. ఇద్దరు ఎప్పుడు ఏదో ఒక కమిట్మెంట్ తో అయితే బిజీగానే ఉంటున్నారు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ కలయికపై సీతారాం ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ తో సాహో నుంచి సినిమా చేయాలని అనుకుంటున్నట్లు త్రివిక్రమ్ కూడా భావించినట్లుగా నాగ వంశీ తెలియజేశారు.

 Producer naga vamshi clarification on trivikram srinivas and prabhas combination

అయితే ప్రభాస్ కూడా అప్పటికే వేరే కమిట్మెంట్స్ తో ఉండటం వల్ల సరైన టైమ్ సెట్ కావడం లేదు అని ఆయన వివరణ ఇచ్చారు. కానీ తప్పకుండా మాత్రం ప్రభాస్ తో సినిమా చేయడానికి ట్రై చేస్తామని నాగ వంశీ తెలియజేశారు. అలాగే మరొకవైపు త్రివిక్రమ్ రామ్ చరణ్ కాంబినేషన్లో కూడా ఒక సినిమా చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు ఈ యువ నిర్మాత తెలియజేశారు. ఇక లిస్టులో చాలా పెద్ద ప్రాజెక్టుల ఉన్నాయి అని వెంకటేష్ గారితో అలాగే చిరంజీవి గారితో కూడా సినిమా చేయాలి ఉంది అని ప్రస్తుతం కదల కోసం కూడా చర్చలు జరుపుతున్నట్లుగా వివరణ ఇచ్చారు.

ఇక ప్రభాస్ తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నట్లు గత కొన్ని నేలల కాలంలో చాలాసార్లు కొన్ని రూమర్స్ అయితే వైరల్ అయ్యాయి. త్రివిక్రమ్ కూడా గతంలో రెండు మూడు సార్లు కలిసినప్పటికీ ఈ కాంబినేషన్ అయితే సెట్ కాలేదు. మరి మహేష్ బాబు సినిమా తర్వాత అయినా ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో చూడాలి. ఇక త్రివిక్రమ్ తర్వాత అల్లు అర్జున్ తో మరో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు ఇదివరకే టాక్ వచ్చింది. కానీ అందులో నిజం లేదని నగవంశీ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X