ఏపీకి టాలీవుడ్ తరలింపు..! ప్రొడ్యూసర్ నాగవంశీ క్లారిటీ..

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై బెనిఫిట్ షోలు రద్దు, టికెట్ల ధరల పెంపు ఉండదని ప్రభుత్వం పెద్దలు తేల్చిన చెప్పిన విషయం తెలిసిందే. దీంతో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్, ఎగ్జిబ్యూటర్స్ అయోమయంలో పడిపోయారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారనే చర్చ పెద్ద ఎత్తున సాగుతుంది. అయితే.. టాలీవుడ్ ని ఏపీకి తరలించడంపై ప్రముఖ సినీ నిర్మాత నాగ వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏమన్నారంటే..?

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు లు సోమవారం నాడు హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో సమావేశం అయ్యారు. విరాళాలు సేకరించి బాలుడు శ్రీతేజ్ కు అందివ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశానికి ముందు నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. నాగవంశీ మాట్లాడుతూ.. సంక్రాంతి సినిమాలకు పెయిడ్‌ ప్రీమియర్స్ అవసరం లేదనీ, తెల్లవారుజామున నాలుగు గంటలకు షో పడితే చాలన్నారు. ప్రస్తుతం ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌రాజు అమెరికాలో ఉన్నారనీ, ఆయన వచ్చాక, సీఎం రేవంత్ రెడ్డిని కలువాలా? లేదా? అనే చర్చించుకుంటామని తెలిపారు.

producer naga vamshi interesting comments on sandhya theater issue

మరో కొన్ని రోజుల్లో దిల్ రాజ్ సినిమా కూడా విడుదల కాబోతుందనీ, ఏం తేలుస్తారో చూడాలన్నారు. అందరితో పాటూ తాను కూడా ఉంటాననీ, దిల్‌రాజు హైదరాబాద్‌ వచ్చాక అందరూ కలిసి డిసైడ్‌ చేసి మాట్లాడుతామని అన్నారు. ఏపీ సీఎం
చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్‌గారిని కలుద్దామని, తనతో అయితే ఎవరూ చెప్పలేదని నాగ వంశీ పేర్కొన్నారు. ఈ తరుణంలో ఇండస్ట్రీ ఏపీకి వెళ్తుందా అనే ప్రశ్నించగా.. తాను డబ్బు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నా.. తాను ఏపీకి వెళ్లి ఏం చేస్తానని సమాధానమిచ్చారు.

ఏపీ ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్.. సీని ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తామని, తమతో ఫస్ట్ మీటింగ్‌లోనే చెప్పారనీ, ఆ సపోర్ట్ అలాగే ఉంటుందని ఆశిస్తున్నాని నాగవంశీ పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్దికి టాలీవుడ్‎కు అవసరమని, ఇండస్ట్రీ ఏపీకి తరలిపోతుందనే ప్రచారం కరెక్ట్ కాదని,.. అది తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. ఇక, బాలకృష్ణ హీరోగా నిర్మాత నాగవంశీ తెరకెక్కించిన డాకు మహారాజ్ మూవీ సంక్రాంతి రేసులో ఉన్న సంగతి తెలిసిందే.

producer naga vamshi interesting comments on sandhya theater issue

బాలయ్య బాబు సినిమా 2025, జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమైంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో మూవీ యూనిట్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం నిర్వహించిన ప్రమోషన్స్‎లో భాగంగా మాట్లాడుతూనే నాగవంశీ పై కామెంట్స్ చేశారు. ప్రస్తుతం నాగవంశీ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ మారుతున్నాయి.

More from Filmibeat

Read more about: tollywood ap telangana
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X