‘మా మీద బతుకుతూ.. మమ్మల్ని చంపే ప్రయత్నం’
మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు సాధిస్తున్నది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ నటించిన ఈ సినిమాకు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. మార్చి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సాధిస్తున్న కలెక్షన్ల గురించి నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాపై ప్రతికూల వార్తల రాస్తున్న కొన్ని వెబ్‌సైట్లపై ఆయన మండిపడ్డారు. నాగవంశీ మీడియాతో మాట్లాడుతూ...
ఏపీలో కొన్ని చోట్ల పెంచిన రేట్లను తగ్గించాం. డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు అందరూ లాభాల్లోకి వచ్చారు. ఇక పదో తరగతి పరీక్షలు ముగిసాయి. ఫ్యామిలీ అంతా థియేటర్‌కు వచ్చి సినిమాను చూడండి. ఈ విషయాన్ని తెలియడానికి ఈ ప్రెస్ మీట్ నిర్వహించాం. అయితే కొన్ని వెబ్‌సైట్లు కంటెంట్ లేకపోయినా ఆడుతున్నది. సీక్వెల్ కాబట్టి ఈ సినిమా నడస్తున్నదని అనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాహుబలి, కేజీఎఫ్, పుష్ప సినిమాల మాదిరిగా మ్యాడ్ సినిమా సీక్వెల్ కాదుగా. ఎలా ఉన్నా చూడటానికి మ్యాడ్ అలాంటి తరహా చిత్రం కాదు. మ్యాడ్ స్క్వేర్ సినిమాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. వారి పేర్లు చెప్పి వారిని పెద్ద చేయడం నాకు ఇష్టం లేదు. ఓ సినిమా బాగుంటే.. మరో ఆడదు అని రాస్తున్నారు. స్వాతిరెడ్డి పాట బాగుంది. ఇంకా బాగుంటే బాగుండేది అని రివ్యూలో చెప్పారు.
సినిమా గురించి ప్రేక్షకులకు తెలియదా? వారి కంటే మీకే ఎక్కువగా తెలుసా? మేము సినిమా తీస్తే మీ వెబ్‌సైట్ రన్ అవుతుంది. మేం ఇంటర్వ్యూ ఇస్తే మీ యూట్యూబ్ రన్ అవుతుంది. మేం యాడ్ ఇస్తే మీ వెబ్ సైట్ రన్ అవుతుంది. మీ రివ్యూలను ఎప్పుడూ తప్పు పట్టలేదు. కానీ సినిమా ఆడుతున్నప్పటికీ.. ఎందుకు ఆడుతున్నదని రివ్యూలు చెప్పడం.. ఆర్టికల్స్ రాయడం చాలా తప్పు. సినిమా ఆడుతేనే వెబ్‌సైట్లు రన్ అవుతాయి అని నాగవంశీ అన్నారు.
మ్యాడ్ స్క్వేర్ సినిమాలో లాజిక్స్ ఉండవు. కథ ఉండవని ముందే చెప్పాను. అయినా పనిగట్టుకొని మా సినిమాపై కుళ్లుబోతు తనాన్ని ప్రదర్శిస్తున్నారు. మీకు ఇష్టం లేకపోతే.. మా సినిమాలను బ్యాన్ చేయండి. నా సినిమా గురించి ఆర్టికల్స్ రాయకండి. వెబ్‌సైట్స్ రాస్తేనే సినిమాలు నడుస్తున్నాయా? మన మీద బతుకుతూ.. మనల్నే చంపాలని చూస్తున్నాడు? అలా ఎందుకు? అని నాగవంశీ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
మ్యాడ్ స్క్వేర్ సినిమాను చూశారు. మీకు నచ్చినట్టు రివ్యూలు రాశారు. రివ్యూ అనేది ఓ మనిషి పర్సనల్ ఒపీనియన్. దానిని నమ్మకండి. అయినా మేము కాదనలేం. అయితే ఈ సినిమాకు కలెక్షన్లు లేవు అని మీ రివ్యూను జస్టిఫై చేసుకొంటున్నారా? ఈ సినిమా కలెక్షన్ల విషయంలో ఎవరికైనా అనుమానాలు ఉంటే.. మీరు నా వద్దకు రండి.. నేను కలెక్షన్ల వివరాలు చూపిస్తాను. సినిమాను ప్రమోట్ చేయడం మీ బాధ్యత కాదా? అని నాగవంశీ ప్రశ్నించాడు.


Click it and Unblock the Notifications











