ఇప్పుడు రియల్ పవర్ స్టార్.. పవన్ కల్యాణ్‌పై నాగవంశీ సెన్సేషనల్ ట్వీట్
పవన్ కళ్యాణ్.. జనసేనాని.. జనసేన.. ఈ పేర్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దాదాపు పదేళ్ల తరువాత జనసేనాని తొలివిజయాన్ని అందుకున్నాడు. 77 వేల మెజారిటీతో లీడ్ లో ఉన్నాడు. ఇక దీంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఇక కేవలం పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఇండస్ట్రీ మొత్తం పవన్ కు శుభాకాంక్షలు తెలుపుతుంది.
పవన్ తో పరిచయం ఉన్నా.. లేకున్నా ప్రతి ఒక్కరు ఆయన వీడియోలను ఎడిట్ చేసి సెన్సేషన్ సృష్టిస్తున్నారు. హీరోలు, డైరెక్టర్స్, నిర్మాతలు.. ఇలా ఒకరు అని చెప్పలేం. పవన్ విజయాన్ని తమ విజయంగా మార్చుకుంటున్నారు. సేనాని సాధించాడు అంటూ చెప్పుకోస్తున్నారు. అందులో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఒకరు. పవన్ అంటే నాగవంశీకి పిచ్చి అని చెప్పొచ్చు.

ఇండస్ట్రీలో ఇలాంటి టఫ్ ప్రొడ్యూసర్ ను ఎప్పుడు చూడలేదు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో పవన్.. భీమ్లా నాయక్ అనే సినిమా చేశాడు. ఆ సమయంలో పవన్ తో పాటు నాగవంశీ కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కున్నాడు. జగన్ ప్రభుత్వం అందరికి టికెట్ రేట్స్ ను పెంచి పవన్ సినిమాకు మాత్రమే గొడవలకు దిగింది. ఆ సమయంలో కూడా పవన్ తొణకలేదు.. బెణుకలేదు. కావాలంటే తన సినిమాలను ఫ్రీగా రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చాడు.
అప్పుడు కూడా నిర్మాతగా నాగవంశీ బెదరకుండా పవన్ వెనుకే నిలబడ్డాడు. అంతలా ఆయనకు సపోర్ట్ గానిలబడ్డాడు. ఏ సమయంలో అయినా పవన్ ను ఎవరేమైనా అన్నా కూడా నాగవంశీ అస్సలు ఊరుకోడు. ఇక నేడు జనసేనాని గెలుపు ఖాయం అయ్యింది. మెజారిటీతో పవన్ గెలిచాడు. దీంతో అభిమానులతో పాటు నాగవంశీ కూడా తన శుభాకాంక్షలు తెలిపాడు.
భీమ్లా నాయక్ సినిమాలోని ఒక చిన్న వీడియో క్లిప్ ను షేర్ చేస్తూ.. ఇప్పుడు గర్వంగా ఆయనను పవర్ స్టార్ అని పిలుద్దాం అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు ఈ సమయంలో భీమ్లా నాయక్ ను రీరిలీజ్ చేయమని అడుగుతున్నారు.
మలయాళంలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన అయ్యప్పన్ కోషియమ్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే ను అందించాడు. ఇక పవన్ కు ధీటుగా రానా నటించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది అని చెప్పలేం కానీ, ఓ మోస్తరుగా ప్రేక్షకులను మెప్పించిందని చెప్పాలి. కానీ, సినిమాలో కొక్కిలి దేవర గా పవన్ నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ముందు ముందు నాగవంశీ.. పవన్ తో మరో సినిమా చేస్తాడేమో చూడాలి


Click it and Unblock the Notifications











