Bheemla Nayak సంక్రాంతి బరిలో.. ట్వీట్‌తో జబర్దస్త్ సమాధానమిచ్చిన నాగవంశీ
భారతీయ సినిమా పరిశ్రమ వేదికపై ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR చిత్రంపై దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఊహించని విధంగా RRR రిలీజ్ వాయిదా పడటంతో సినిమా ఇండస్ట్రీలో రకరకాల చర్చలకు దారి తీస్తున్నాయి. RRR సినిమా వాయిదా పడటంతో భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అవుతుందనే విషయం మీడియాలో వైరల్‌గా మారింది. అయితే నిర్మాత నాగవంశీ ఆసక్తికరంగా ఇచ్చిన ట్విస్ట్ ఏమిటంటే..

RRR మూవీ రిలీజ్ వాయిదాతో
RRR రిలీజ్ వాయిదా వార్త తర్వాత భీమ్లా నాయక్ విడుదల అంశం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ సినిమాను జనవరి 12వ తేదిన రిలీజ్ చేస్తున్నారనే విషయం అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. అయితే భీమ్లా నాయక్ రిలీజ్ చాలా అంశాలు అడ్డుపడ్డాయనే విషయాలు మీడియాలో వెలుగు చూశాయి.

భీమ్లా నాయక్ సంక్రాంతి బరి నుంచి
RRR రిలీజ్ కారణంగా భీమ్లా నాయక్ సంక్రాంతి బరి నుంచి తప్పుకొన్నది. దాంతో పూర్తి కావాల్సిన కొన్ని సన్నివేశాల షూటింగ్‌ను వాయిదా వేశారు. అయితే సంక్రాంతి బరిలో సినిమా తీసుకు రావాలంటే.. ఆ సీన్లు పూర్తి చేయాల్సి ఉంది. వచ్చే 10 రోజుల్లో పూర్తి చేయడం కష్టం కనుక భీమ్లా నాయక్ సంక్రాంతి బరిలో దూకలేకపోయిందనే విషయం మీడియాలో వినిపిస్తున్నది.

రష్యా పర్యటనలో పవన్ కల్యాణ్
ఇక భీమ్లా నాయక్ షూటింగ్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అందుబాటులో లేకపోవడం కూడా భీమ్లా నాయక్ మూవీ సంక్రాంతి బరిలో లేకపోయిందనే విషయం స్పష్టమైంది. పవన్ కల్యాణ్ ఫ్యామిలీతో కలిసి రష్యాకు వెకేషన్ కోసం వెళ్లారు. దాంతో ఈ సినిమాను అర్జెంట్‌గా పూర్తి చేయడం కష్టంగా మారిందనే విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.

ఫిబ్రవరిలోనే భీమ్లా నాయక్
దాంతో ముందు నిర్ణయించుకొన్న విధంగా భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కానున్నది. రానాపై కొన్ని సీన్లు, అలాగే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉన్నట్టు సమాచారం. ఫిబ్రవరిలోపు అన్ని పనులు పూర్తి చేసుకొన్ని పక్కాగా ప్రమోషన్‌తో భీమ్లా నాయక్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

జనవరి 14న డీజే టిల్లు
ఇక భీమ్లా నాయక్ సినిమాకు బదులు నిర్మాత నాగవంశీ మరో సినిమాను తెరపైకి తీసుకొచ్చారు. యువ హీరో, హీరోయిన్లు సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా డిజె టిల్లు మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. ఈ చిత్రాన్ని జనవరి 14, 2022 న విడుదల చేస్తున్నట్టు నాగవంశీ తెలిపారు. దీంతో భీమ్లా నాయక్ బదులు డీజే టిల్లు ప్రేక్షకుల ముందుకు రానున్నది.


Click it and Unblock the Notifications











