Swathi Muthyam నిర్మాత నాగవంశీ దసరా కానుక.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
గతంలో రిలీజ్ వాయిదా పడిన స్వాతిముత్యం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నది. దసరా శుభాకాంక్షలతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ విడుదల తేదీ ఖరారు చేసింది. స్వాతి ముత్యం ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తూ అక్టోబర్ 5వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ అధికారికంగా ప్రకటించారు.
గణేష్ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం స్వాతిముత్యం. వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా లక్ష్మణ్ కే కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

స్వాతిముత్యం లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల,ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రం. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు తప్పనిసరి. ప్రధానంగా ఇవన్నీ వినోదాన్ని పుష్కలంగా పంచుతాయి. సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి. ప్రేమతో కూడిన వినోద భరిత కుటుంబ కథా చిత్రం స్వాతిముత్యం. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా స్వాతిముత్యం సినిమాను తీర్చి దిద్దామని దర్శకుడు లక్ష్మణ్ తెలిపారు
చిత్ర ప్రచారం కూడా సగటు సినిమా ప్రేక్షకుడిని ఆకట్టుకుంటూ, ఆసక్తిని కలిగిస్తోంది.ఇటీవల విడుదల అయిన "నీ చారెడు కళ్లే చదివేస్తూ ఉన్నా" గీతం తో పాటు ఇప్పటివరకు చిత్రానికి సంబంధించి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో చిత్రం సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి అన్న వార్తలు సంతోషాన్ని కలిగిస్తున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది.

నటీనటులు: గణేష్, వర్ష బొల్లమ్మ, సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద తదితరులు
సంగీతం: మహతి స్వర సాగర్
సినిమాటోగ్రఫీ: సూర్య
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: అవినాష్ కొల్ల
పీఆర్వో: లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పీడీవీ ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన, దర్శకత్వం: లక్ష్మణ్ కే కృష్ణ


Click it and Unblock the Notifications











