‘శ్రీలీల అందుకే సినిమా నుంచి తప్పుకొన్నది.. భాగ్యశ్రీ భోర్సే ఆఫర్ అలా’

స్టార్ హీరోల సినిమాల నుంచి హీరోయిన్లు తప్పుకోవడం ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. ఆ వార్తపై రకరకాల ఊహాగానాలు, రూమర్లు ఆటోమెటిక్‌గా మీడియాలో కనిపిస్తాయి. అఖిల్ అక్కినేని నటించిన తాజా చిత్రం లెనిన్ సినిమాలో ముందుగా టాప్ హీరోయిన్ శ్రీలీలను అనుకొన్నారు. కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత ఆమె ఈ సినిమా నుంచి తప్పుకొన్నారు. దాంతో ఈ చిత్రంలో అఖిల్ పక్కన భాగ్యశ్రీ భోర్సేకు అవకాశం ఇచ్చారు. అయితే ఈ వ్యవహారం మీడియాలో ఆసక్తికరమైన చర్చకు గాసిప్స్‌కు చోటిచ్చింది. అయితే తాజాగా లెనిన్ సినిమా ప్రమోషన్స్‌లో నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. శ్రీలీల తప్పుకోవడం గురించి నాగవంశీ మాట్లాడుతూ..

లెనిన్ సినిమా కథ డిమాండ్ మేరకు శ్రీలీల అనుకొన్నాం. ఆమెను సంప్రదించగా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకొన్నారు. కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత ఆమెతో డేట్స్ ఇష్యూ వచ్చింది. దాంతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకొన్నది. కానీ డేట్స్ అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నించాం. కానీ కుదర్లేదు. దాంతో ఈ సినిమా నుంచి బయటకు వెళ్లింది.

Bhagyasri Borse Vs Sreeleela

హీరోయిన్ శ్రీలీల తప్పుకోవడం మీడియాలో రకరకాల వార్తలు, గాసిప్స్ వినిపించాయి. అందులో వాస్తవం లేదు. శ్రీలీల ఈ సినిమా నుండి తప్పుకోవడానికి ప్రధాన కారణం ఆమె బిజీ షెడ్యూల్. ఇది కేవలం డేట్స్ సమస్య మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు అని నాగవంశీ తెలిపారు. లెనిన్ సినిమా నిర్మాణంలో జరిగిన కొన్ని క్రియేటివ్ డిస్కషన్స్ వల్ల షూటింగ్ ఆలస్యమైంది. ఆ సమయంలోనే శ్రీలీలకు బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్‌తో ఆషికీ 3 సినిమా, శివ కార్తీకేయన్‌తో తమిళంలో పరాశక్తి లాంటి భారీ ప్రాజెక్టులు వచ్చాయి. దాంతో మా సినిమాకు క్లాష్ ఏర్పడింది. దాంతో ఆ సినిమాల కోసం డేట్స్ సర్దుబాటు చేయడం కష్టమవ్వడంతో సినిమా నుంచి తప్పుకొన్నారు. ఇందులో ఎలాంటి వివాదం లేదు. పరస్పర అంగీకారంతోనే ఈ మార్పు జరిగిందని ఆయన పేర్కొన్నారు.

Also Read
Lenin Business: లెనిన్ వరల్డ్ వైడ్ బిజినెస్.. ఎన్ని కోట్లు వస్తే అఖిల్ మూవీ హిట్ అంటే?
Lenin Business: లెనిన్ వరల్డ్ వైడ్ బిజినెస్.. ఎన్ని కోట్లు వస్తే అఖిల్ మూవీ హిట్ అంటే?

శ్రీలీల తర్వాత ఆ పాత్రకు కొందరు హీరోయిన్లను పరిశీలించాం. అయితే స్టోరీ, క్యారెక్టర్ డిమాండ్ మేరకు భాగ్యశ్రీ భోర్సే కరెక్ట్ ఛాయిస్ అనుకొన్నాం. దాంతో ఆమెను సంప్రదించగా అందుకు ఒప్పుకోవడంతో ఈ ప్రాజెక్టులోకి ఆమె వచ్చింది. దాంతో ఈ సినిమా కోసం శ్రీలీలతో చేసిన కొన్ని సీన్లు రీ షూట్ చేయాల్సి వచ్చింది. అవి కూడా కొన్ని సీన్లు మాత్రమే అంటూ నాగవంశీ శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ బోర్సే రావడం వెనుక ఉన్న అసలు కారణాన్ని ఆయన బయటపెట్టారు.

Recommended For You
ఆ క్రికెటర్ దారుణంగా చీటింగ్ ఛేశాడు.. షాకింగ్‌గా తెలుగు హీరోయిన్ సోషల్ మీడియా పోస్ట్
ఆ క్రికెటర్ దారుణంగా చీటింగ్ ఛేశాడు.. షాకింగ్‌గా తెలుగు హీరోయిన్ సోషల్ మీడియా పోస్ట్

తెలుగులో యువ హీరో, హీరోయిన్లు అఖిల్, భాగ్యశ్రీ భోర్సే జంటగా నటించిన లవ్, ఎమోషనల్, డివోషనల్ రూరల్ డ్రామా లెనిన్. ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పీ, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో సమర్పిస్తున్నది. ఈ చిత్రంలో శివాజీ, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్, రమేశ్ ఇందిరా తదితరులు నటించారు.

You May Also Like
గట్టా కుస్తీ సినిమాను చంపేస్తున్నారు.. విజయ్ ఫ్యాన్స్‌, టీవీకేపై విష్ణు విశాల్ ఆగ్రహం
గట్టా కుస్తీ సినిమాను చంపేస్తున్నారు.. విజయ్ ఫ్యాన్స్‌, టీవీకేపై విష్ణు విశాల్ ఆగ్రహం

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే. సినిమాటోగ్రఫి: లియోన్ బ్రిట్టో, మ్యూజిక్ డైరెక్టర్: థమన్ ఎస్, ఎడిటర్: నవీన్ నూలీ, యాక్షన్ కోరియోగ్రఫి: దిలీప్ సుబ్బరాయన్, రామ్ లక్ష్మణ్, విజయ్, రియల్ సతీష్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్ల, కొరియోగ్రఫి: దినేష్ మాస్టర్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా జూలై 10వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి క్రేజ్ ఏర్పడింది. భాగ్యశ్రీ క్యారెక్టర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ పాత్ర విషయంలో తెలుగు ఆడియెన్స్ ఎలా రియాక్ట్ అవుతారో అనే విషయం గురించి, సినిమాపై రాసే ఫీల్మ్ బీట్ ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం వేచి చూడండి..

Read more about: naga vamsi sreeleela lenin
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X