Rashmika Marriage: రష్మిక పెళ్లి పై స్టార్ ప్రొడ్యూసర్ కామెంట్స్.. ఏమన్నారంటే?

Rashmika Marriage: రష్మిక మందాన.. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా మారింది. తన అందం, అభినయంతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. కోట్లాదిమంది యూత్ గుండెల్లో కలల రాణిగా ముద్ర వేసుకుంది. అటు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. అయితే రష్మిక మందాన పెళ్లిపై ఓ స్టార్ ప్రొడ్యూసర్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆ ప్రొడ్యూసర్ ఎవరు? ఆయన ఏమన్నారంటే?

రష్మిక మందాన.. ఇటు సౌత్ లో.. అటు నార్త్ లో.. మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్.. ఇటీవల అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప 2 సినిమాతో మరింత పాపులాటిని సొంతం చేసుకుంది. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది శ్రీవల్లి. కెరీర్లో సూపర్ సక్సెస్ గా దూసుకెళ్తున్న ఈ అమ్మడు లవ్ మేటర్ కూడా నెట్టింట్లో ఎప్పుడు చర్చనీయమే. ప్రేమ పెళ్లి విషయాలతో రష్మిక ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

Producer Naga Vamsi commented on Rashmika s Marriage in Nandamuri Balakrishna Unstoppable Talk show

వాస్తవానికి రష్మిక కన్నడ హీరో రక్షిత్ శెట్టి తో తొలుత నిశ్చితార్థం చేసుకుంది. ఎంగేజ్మెంట్ వరకు వచ్చిన వీరి ప్రేమాయణానికి పెళ్లి పీటలు ఎక్కముందే ఎండ్ కార్డ్ పడిపోయింది. ఇంత రష్మిక-విజయ్ దేవరకొండతోనే ప్రేమలో ఉందని, వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. తరచూ వీళ్లిద్దరూ మీడియా కంట కనబడడంతో, వీరి మధ్య సంథింగ్.. సంథింగ్.. అంటూ మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి.

అందుకు తగ్గట్టుగానే వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే పలు సందర్భాలలో ఇన్ డైరెక్ట్ గా తాము రిలేషన్ లో ఉన్నామంటూ ఇచ్చిన విషయం కూడా తెలిసింది. దీంతో వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తెలుగు సినిమా ప్రొడ్యూసర్ నాగ వంశీ బాలకృష్ణ పోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో కి గెస్ట్ గా వచ్చారు.

Producer Naga Vamsi commented on Rashmika s Marriage in Nandamuri Balakrishna Unstoppable Talk show

ఈ సమయంలో బాలకృష్ణ రష్మిక గురించి ప్రస్తావన తీసుకురాగా.. ప్రొడ్యూసర్ నాగ వంశం మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీలో హీరో ను పెళ్లి చేసుకుంటుందని తెలుసు సార్, కానీ, ఎవరో ఏంటో అనేది మాత్రం చెప్పట్లేదు ఇంకా' అని అంటారు. దీంతో నాగ వంశీ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆ తెలుగు హీరో ఎవరో కాదు.. హీరో విజయ్ దేవరకొండ అంటూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X