ఇప్పుడు నా ఇగో చల్లబడింది... నిర్మాత నాగవంశీ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ కూడా ఒకరు. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ మొదలుపెట్టి.. బడా నిర్మాతగా ఎదిగారు వంశీ. ఏడాదికి కనీసం మూడు, నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తూ దూసుకొచ్చారు. అయితే గతేడాది నాగవంశీకి గతేడాది చేదు ఫలితాలు వచ్చాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన కింగ్డమ్, మాస్ జాతర చిత్రాలు డిజాస్టర్‌గా నిలవగా... జూనియర్ ఎన్టీఆర్ - హృతిక్ రోషన్‌లు నటించిన వార్ 2ను తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేసిన వంశీ భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
నాగవంశీపై ట్రోలింగ్
ఈ పరిణామాలకు తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో వంశీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా.. దానిపై భారీగా ట్రోలింగ్ జరిగింది. ఒకానొక దశలో నాగవంశీ తన ఆస్తులు అమ్ముకుని దుబాయ్‌కి వెళ్లిపోయారంటూ గాసిప్స్ వైరల్ అయ్యాయి. దీనిపై నాగవంశీ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తాను ఎక్కడికి వెళ్లలేదని.. పరాజయాలకు, నష్టాలకు తాను కృంగిపోనని సినిమాలు తీస్తూనే ఉంటానని ఆయన క్లారిటీ ఇచ్చారు. అందుకు తగినట్లుగానే సంక్రాంతితో మొదలుపెట్టి 2026లో దాదాపు 10 సినిమాల వరకు సితార ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి రిలీజ్ కానున్నాయి. లెనిన్, అనగనగా ఒకరాజు, సూర్య 46, ఫంకీ, ఆల్కహాల్, ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్, వాయుపుత్ర, మేజిక్, విసా- వింటారా సరదాగా తదితర సినిమాలను నాగవంశీ నిర్మిస్తున్నారు.

అనగనగా ఒక రాజుకు కాసుల పంట
సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన విడుదలైన అనగనగా ఒక రాజు సంచలన విజయం సాధించింది. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరిలు హీరో హీరోయిన్లుగా మారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేవలం 3 రోజుల్లోనే 50 కోట్ల మార్క్ దిశగా పరుగులు తీస్తోంది. దాంతో కొత్త సంవత్సరాన్ని విజయంతో ప్రారంభించింది సితార సంస్థ. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శిస్తుండటంతో చిత్ర యూనిట్ కనుమ పండుగ నాడు హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నాగవంశీ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
వాళ్లకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా
ఆరేళ్ల తర్వాత సంక్రాంతి పండుగ సంతృప్తినిచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా హిట్ సాధించినా డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి అనుకున్నంత స్థాయిలో రిజల్ట్ కనిపించలేదు. 2020లో అల వైకుంఠపురం తర్వాత సంతృప్తి లభించింది. ఇలాంటి విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్. నా సినిమా ఆడాలని తోటి నిర్మాతలు కూడా గట్టిగా కోరుకున్నారు. సోషల్ మీడియాలోనూ నా ఫ్యాన్ బాయ్స్ గడిచిన 72 గంటల నుంచి బలంగా నిలబడ్డారు.. సినిమాకు మరో వారం రోజులు సపోర్ట్ చేస్తే వారందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తా. రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు వంటి పెద్ద సినిమాలు వస్తున్నా.. నన్ను నమ్మి, నాకు సపోర్ట్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్‌కు థ్యాంక్స్ చెప్పారు నాగవంశీ.
నా ఇగో చల్లబడింది
అసలు సంక్రాంతికి సినిమా తీసి హిట్ కొట్టాలన్నది నాకు ఇగో. ఎందుకంటే సంక్రాంతికి సినిమా పడి, అది హిట్ అయి, డిస్ట్రిబ్యూటర్లకు కమీషన్లు వస్తే అది చిన్న శాటిస్‌ఫెక్షన్. మధ్యలో రెండు మూడు సార్లు మిస్ ఫైర్ అయినా.. ఈసారి మాత్రం గట్టిగా కొట్టా. ఎప్పుడు సినిమా వచ్చినా, పోయినా పెద్దగా కిక్ ఉండదు.. కానీ సంక్రాంతి టైంలో వచ్చి ఆడటం అనేది కొంచెం ఇగో ఫ్యాక్టర్ అయిపోతుంది. ఆ టైంలో హిట్ కొట్టడం అనేది నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు ఇంపార్టెంట్. 2026 జర్నీ సక్సెస్‌తో స్టార్ట్ అవ్వడానికి హెల్ప్ చేసిన నవీన్‌కి థ్యాంక్స్. ఆ తర్వాత మీనాక్షికి కృతజ్ఞతలు. నవీన్ తన మూడ్ ప్రకారం సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతాడు. నువ్వు ఏ సినిమాకు కమిట్ కాకుండా ఖచ్చితంగా సంక్రాంతికి హిట్ ఇస్తామని ఆ అమ్మాయికి భరోసా ఇచ్చాను అని వంశీ వెల్లడించారు
ఆ రెండ్రోజులు నిద్రపోలేదు
నిర్మాతగా కెరీర్ ప్రారంభించిన తర్వాత ఇన్నేళ్లలో ఈ సినిమాకు పడినంత టెన్షన్ ఎప్పుడు పడలేదు. లాస్ట్ ఇయర్ వరుసగా నా సినిమాలు డిజాస్టర్లు కావడంతో 12, 13 తేదీలలో నిద్రలేదు. మా బాబాయ్ కూడా నా పరిస్ధితి చూసి కంగారుపడ్డాడు. సినిమా హిట్, ఫ్లాప్‌లను పట్టించుకోవద్దు.. ఇదికాకపోతే మరొకటి హిట్ అవుతుందని ధైర్యం చెప్పారని వంశీ వెల్లడించారు. త్రివిక్రమ్ గారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పుడే ఈ సినిమా హిట్ అని చెప్పా.. దానిని బట్టి ఆయన జడ్జిమెంట్‌కు తిరుగులేదని మరోసారి రుజువైంది అని నాగవంశీ అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











