అతడు, ఖలేజా, గుంటూరు కారం సినిమాల మధ్య తేడా అదే.. క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో గతంలో అతడు, ఖలేజా వంటి బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రాలు రాగా.. తాజాగా గుంటూరు కారం సినిమాతో మరోసారి కలిసి వచ్చారు. వసూళ్ల పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాపై మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం కాస్త నిరాశహా ఉన్నారు. ఊహించిన స్థాయిలో చిత్రం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే వీటిపై ప్రొడ్యూసర్ నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా అతడు, ఖలేజా, గుంటూరు కారం సినిమాల మధ్య తేడాను వివరించారు.
ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబోలో ఇప్పటి వరకు మూడు చిత్రాలు వచ్చాయని... ముందు వచ్చిన రెండు సినిమాలు ఒకేలాగా ఉండడం.. అందులోనూ అవి బ్లాక్ బస్టర్ హిట్టు కావడంతో గుంటూరు కారంపై పెద్ద ఎత్తున అంచనాలు క్రియేట్ అయ్యాయని నాగవంశీ చెప్పుకొచ్చారు. కేవలం అంచనాలు అయితే ఫర్వాలేదు కానీ.. ఆ రెండు చిత్రాల్లాగే ఈ సినిమా కూడా ఉంటుందని అంతా ఊహించారని తెలిపారు. సినిమా వాళ్లు ఊహించినట్లు లేకపోయేసరికి అలా కామెంట్లు చేస్తున్నారని అన్నారు.

కానీ గుంటూరు కారం సినిమా చాలా బాగుందని.. ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మూడు సినిమాల మధ్య తేడాను వివరించే ప్రయత్నం చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ 2005లో మహేష్ బాబుతో తీసిన అతడు చిత్రం, అలాగే ఆ తర్వాత అంంటే 2010లో చేసిన ఖలేజా చిత్రం కల్ట్ అని వివరించారు. కానీ గుంటూరు కారం సినిమా మాత్రం కమర్షియల్ సినిమా అని నిర్మాత నాగవంశీ వెల్లడించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రాబోతున్నాం కాబట్టే కమర్షియల్ సినిమాతో వచ్చామని మరోసారి క్లారిటీ ఇచ్చారు.

ఇదంతా ఇలా ఉండగా.. మహేష్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి పండుగ సందర్బంగా జనవరి 12వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు నుంచి మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం దుమ్మురేపుతుంది. ఇప్పటికే ఈ సినిమా వారం రోజుల్లో రూ.212 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డులు కొల్లగొడుతుంది.


Click it and Unblock the Notifications











