GunturKaaram: గుంటూరు కారం విషయంలో మేము చేసిన తప్పు అదే... ఒప్పుకున్న నిర్మాత నాగవంశీ!
గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది. ఇప్పటి వరకు 212 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా సక్సెస్, రిజల్ట్ మీద నిర్మాత నాగవంశీ మీడియా సమావేశం నిర్వహించారు. ఇక ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు జనవరి 12న వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు నుంచి మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం దుమ్మురేపుతుంది. ఇప్పటికే ఈ సినిమా వారం రోజుల్లో రూ.212 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డులు కొల్లగొడుతుంది.

అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన రీజనల్ సినిమాగా సరికొత్త రికార్డును గుంటూరు కారం సెట్ చేసింది. ఇక ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా.. రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. హారికా హాసినీ క్రియోషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా విజయం పై చిత్రయూనిట్, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అయితే సినిమా విడుదల రోజు నుంచి నెగిటివ్ టాక్, మిక్స్ డ్ రివ్యూలు బయటకు వచ్చాయి. ఇక సోషల్ మీడియాలో పలువురు సినిమా బాగోలేదని కామెంట్స్ చేయగా... కొంతమంది సినిమాపై విమర్శలు గుప్పించారు. ఇటీవల దిల్ రాజు, నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి సినిమా బాగా ఆడుతుందని... మంచి కలెక్షన్స్ వస్తున్నాయని క్లారిటీ ఇచ్చారు. ఇక తాజాగా గుంటూరు కారం సినిమా గురించి, కలెక్షన్స్ గురించి, సినిమా ఫలితం గురించి నిర్మాత నాగవంశీ మీడియా సమావేశం పెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇక ఈ సినిమాలో నాగవంశీ మాట్లాడుతూ... సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి.. ఇక బ్రేక్ ఈవెన్ దగ్గర్లో ఉన్నాం... ఫ్రాఫిట్స్ కూడా వస్తున్నాయి.. అందరికీ డబ్బులు వస్తున్నాయి.. బయ్యర్స్ సేఫ్ అయ్యారు అంటూ చెప్పుకువచ్చారు. కొంత మంది గుంటూరు కారానికి వచ్చే కలెక్షన్స్ ఫేక్ అంటూ ప్రచారం చేస్తున్నారు.. అలాంటి వారు వీటిని ఫ్రూవ్ చేయొచ్చు అంటూ షాకిచ్చాడు. ఇక సోషల్ మీడియాలో చేసే కామెంట్స్ మేం పట్టించుకోము.. ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తున్నారు అంటూ తెలిపారు.
ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ మా సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. చాలా మంది మహిళలు సినిమా చూసి మాట్లాడిన వీడియోలు నేను చూశాను... అంటూ చెప్పుకువచ్చారు. మేము చేసిన తప్పు ఏంటంటే.. 1AM ప్రీమియర్ షోస్ వేయడం.. అర్ధరాత్రి షోలు వేయడం వల్ల రివ్యూలు నెగిటివ్ గా వచ్చాయి. ఇది ఫ్యామిలీ సినిమా.. ముందు నుంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని ప్రమోట్ చేయకపోవడం మా తప్పే.. ఇది ఫ్యామిలీ అడియెన్స్ కు బాగా నచ్చే సినిమా.. అంటూ తెలిపారు.

ఇది ఫ్యామిలీ సినిమా అని ప్రమోట్ చేయకపోవడం వల్ల ఇదంతా మాస్ మాసాలా చిత్రం అనుకుని 1AM షోకి వచ్చారు. మాస్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉండి వాళ్ళ అంచనాలు అందుకోలేకపోయాం కాబట్టే నెగిటివిటీ వచ్చిందంటూ తెలిపారు. మధ్యాహ్నం నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళాక సినిమాకి బాగా కనెక్ట్ అయి పాజిటివ్ టాక్ వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. ఇక రెండో రోజు నుంచి మంచి కలెక్షన్స్ వచ్చాయి. రివ్యూలు, సోషల్ మీడియాలో మార్నింగ్ వచ్చిన టాక్ చూసి వాటి వాళ్ళు కొంచెం ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారని తెలిపారు.


Click it and Unblock the Notifications











