ఆ పాటలో అసభ్యత ఏంముంది? మహేష్ బాబు కుర్చీ మడతపెట్టి చేశాడు అంతేగా.. నాగవంశీ ఫైర్!
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి.. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదిరిపోయే కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎప్పుడూ అలరించే ఈయన వరుస హిట్లతో రచ్చ చేస్తున్నాడు. ఆయన అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు. అయితే తాజాగా మిల్క్ బాయ్ మహేష్ బాబ్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఓ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు పదమూడేళ్ల తర్వాత వీరి కాంబోలో సినిమా వస్తుందని తెలిసనప్పటి నుంచి అభిమానులు ఫుల్ ఎగ్జైటింగ్ గా వేచి చూస్తున్నారు.
ఎప్పుడెప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్లు బయటకు వస్తాయా.. చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని తెగ ఆతృతుగా చూస్తున్నారు. శ్రీమతి మమత సమర్పణలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే మహేష్ బాబు సరసన ఈ సినిమాలో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీలు, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. జనవరి 12వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. ఇక అప్పటి నుంచి మహేష్ బాబు ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు.

ఈక్రమంలోనే చిత్రబృందం తాజాగా కుర్చీ మడత పెట్టిన అనే పాట ప్రోమోను విడుదల చేశారు. ఇక ఈ పాట వచ్చినప్పటి నుంచి నెటిజెన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఇలాంటి బూతు మాటను వాడుతూ ఉన్న పాటలో మహేష్ బాబు చేయడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేధికగా వెల్లడిస్తున్నారు. మరికొంత మంది అయితే అనవసరంగా రచ్చ చేస్తున్నారు. ఈక్రమంలోనే చాలా మంది సెలబ్రిటీలు ఈ పాటపై స్పందిస్తూ క్లారిటీ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ పాట రాసిన రామజోగయ్య శాస్త్రి మహేష్ అభిమానులపై ఫైర్ అయ్యాడు. కానీ బ్యాక్ ల్యాష్ కావడంతో ఎక్స్ అకౌంట్ ను డీయాక్టివేట్ చేసుకున్నాడు.
అయితే తాజాగా ఈ సినిమా ప్రొడ్యూసర్ నాగవంశీ స్పందించారు. ఎక్స్ వేధికగా.. కుర్చీ మడత పెట్టి పాట ప్రోమోపై అనేక రకాల ట్రోల్స్ వచ్చాయని చెప్పుకొచ్చారు. కొంతమంది సాహిత్యం గురించి మాట్లాడుతుంటే మరికొంత మంది కుర్చీ మడత పెట్టి డైలాగ్ వాడడంపై కామెంట్లు చేస్తున్నారని అన్నారు. నెగిటివ్ గా మాత్రమే కాకుండా మరికొన్ని పాజిటివ్ కామెంట్లు కూడా వస్తున్నాయని వాటిని వివరించే ప్రయత్నం చేశారు ప్రొడ్యూసర్ నాగవంశీ. ముఖ్యంగా మహేష్ బాబు ఏం చేశాడు.. జస్ట్ చైర్ ఫోల్డ్ చేసి డ్యాన్స్ చేశాడు అంతే కదా... పాజిటివ్ గా ఆలోచించండి అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే గుంటూరు కారం సినిమా అనేది మాస్, ఫ్యామిలీ, యూత్ ఇలా అన్ని రకాల అభిమానులను సంతృప్తి పరిచే విధంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అన్ని రకాల ఎమమోషన్లు కల్గిన హై ఓల్టేజీ ప్యాకేజీ అని నాగవంశీ వెల్లడించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రాబోతున్న ఈ సినిమాకు అభిమానులకు ఫుల్ మాస్ ట్రీట్ ఇస్తుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ సహా ఎంతో మంది సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జనవరి 12వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుందో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











