RGV చీటింగ్‌పై సంచలన నట్టి కుమార్ ఆరోపణలు.. బాధితులు సీరియల్‌గా అంటూ విమర్శలు

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత నట్టి కుమార్ మధ్య వివాదం ఎడతెరగని సీరియల్‌లా కొనసాగుతున్నది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకొంటూ మీడియాలో హంగామా చేస్తున్నారు. అయితే గతంలో నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసి.. పరువునష్టం దావా వేస్తున్నట్టు వర్మ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.. తాజాగా వర్మకు నట్టి కుమార్ కౌంటర్ ఇస్తూ...

నన్ను, నా స్నేహితులనే కాకుండా చాలా మంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లను, ఇతరులను రాంగోపాల్ వర్మ మోసం చేశాడు. నేను చెప్పిన మాటలు అక్షర సత్యాలు. అయితే నేను చెప్పిన విషయాలు నమ్మకపోయినా పర్వాలేదు. కానీ త్వరలోనే వాస్తవాలు సీరియల్‌గా వెలుగులోకి రానున్నాయి. మాయమాటలు చెప్పి తన సినిమాలకు పెట్టుబడులు పెట్టించడం ఆ తర్వాత వారిని నట్టేటా ముంచడం చేస్తున్నాడు అని నటి కుమార్ ఘాటుగా స్పందించారు.

Producer Natti Kumar criticises Ram Gopal Varma over Cheating

వర్మ బాధితులు చాలా మంది ఉన్నారు. వారు బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం నన్న చాలా మంది సంప్రదిస్తున్నారు. వర్మ బాగోతాలు ఒక్కక్కటిగా బయటకు సీరియల్‌గా రాబోతున్నాయి. బెంగళూరుకు చెందిన సూర్య ఫిలిమ్స్ అధినేత, డిస్ట్రిబ్యూటర్ సూర్యనారాయణ్ తన బాధను చెప్పుకొనేందుకు బయటకు వచ్చాడు అని నట్టి కుమార్ తెలిపారు.

గతంలో వర్మ రూపొందించిన ఆఫీసర్ చిత్రానికి సంబంధించి కర్ణాటక డిస్ట్రిబ్యూషన్‌ను సూర్య నారాయణ్ చేశాడు. ఆ సినిమా కోసం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా తనకు తిరిగి డబ్బులు చెల్లించకుండా వర్మ తప్పించుకుని తిరుగుతూనే ఉన్నాడు. ఫిలిం ఛాంబర్స్‌కు వర్మపై ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది అని నట్టి కుమార్ వివరించారు. ఎప్పటికప్పుడు తర్వాత సినిమాకు ఇస్తానని తప్పించుకుని తిరగడం వర్మకు వెన్నతో పెట్టిన విద్య. అని నట్టి కుమార్ ఘాటుగా విమర్శలు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X