‘రాంచరణ్‌పై అల్లు అరవింద్ చీప్‌గా.. కడుపు మండిపోయింది’

ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇటీవల ఎక్కువ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సినిమాల ప్రమోషన్స్ తో పాటు పలు అంశాల కారణంగానూ ఆయన పేరు వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. గతేడాది చివర్లో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప2' చిత్రం విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటతో వరుసగా మీడియాలో కనిపించారు. ఇక ప్రస్తుతం తన బ్యానర్ నుంచి విడుదలవుతున్న చిత్రాల ప్రమోషన్స్ లో నిత్యం మీడియాలో కనిపిస్తున్నారు.

అల్లు అరవింద్ మీడియాతో ఎంత చమత్కారంగా ఉంటారో తెలిసిందే. చాలా సరదాగా, ఫన్నీ కామెంట్స్ చేస్తూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. అదే ఈ క్రమంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు మెగా అభిమానుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయి. తాజాగా ఓ ఫంక్షన్ లో ఆయన మాటలు ఇండస్ట్రీలో చర్చకు దారి తీశాయి. 'ఒక సినిమాను కిందికి తొక్కేసి మరో సినిమాకు పైకి తీసుకెళ్లడం.. ఐటీ దాడులు' అంటూ ఆయన మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.

Producer Natti Kumar fire on Allu Aravind Comments about Game Changer Movie

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను, చెర్రీ నటించిన 'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని, దిల్ రాజ్ ను ఉద్దేశించే ఇలా వ్యాఖ్యలు చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇప్పుడైతే టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ మీడియాతో డైరెక్ట్ గానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అల్లు అరవింద్ రామ్ చరణ్ ను ఉద్దేశించిన బాధ్యతా రహితంగా మాట్లాడరని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ సినిమా అయినా.. రామ్ చరణ్ సినిమా అయినా ఆయన పాజిటివ్ గా మాట్లాడాలని అన్నారు.

రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా సమాజానికి సందేశాన్ని ఇచ్చే చక్కటి చిత్రమని, అంత మంచి సినిమాను పలు వేదికలపై బ్లాక్ బాస్టర్ అని చెప్పాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. నా రెండు సినిమాలు హిట్ అని, ఐటీ రైడ్స్ సహజంగానే జరిగాయనే చెప్పాలి కానీ ఉద్దేశించి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. ఫ్యాన్స్ మధ్య వార్ క్రియేట్ చేసేలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఎవరేమన్నా.. గేమ్ చేంజర్ చిత్ర బ్లాక్ బాస్టర్ అని తన అభిప్రాయాన్ని నొక్కి చెప్పారు.

Producer Natti Kumar fire on Allu Aravind Comments about Game Changer Movie

ఇక దిల్ రాజు కూడా 'గేమ్ ఛేంజర్' మూవీ ఫ్లాప్ అనే వ్యాఖ్యలపై స్పందించాలన్నారు. రామ్ చరణ్ ప్రాణం పెట్టి ఈ సినిమాను తీశారని, అవకాశం దొరికిందనే ఉద్దేశంతో అల్లు అరవింద్ అలా మాట్లాడటం సరికొదన్నారు. ఆయన మేనల్లుడనే ఆలోచనతోనైనా సినిమాను, రామ్ చరణ్ ను సోపోర్ట్ చేయాల్సి ఉండిందన్నారు. మొత్తానికి అల్లు అరవింద్ తప్పుగా మాట్లాడారని అభిప్రాయపడ్డారు. రామ్ చరణ్ ఎవరినీ ఉద్దేశించి మాట్లాడరని, చాలా మంచి వ్యక్తి, ఎక్కడా అమర్యాదగా ఉండబోరని చెప్పారు. ప్రస్తుతం ఆయన మాటలు హాట్ టాపిక్ గ్గా మారాయి. ఇక 'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని దిల్ రాజ్ నిర్మించిన విషయం తెలిసిందే. తమిళ స్టార్ డైరెక్టర్ తొలి తెలుగు చిత్రంగా ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. థమన్ అదిరిపోయే సంగీతాన్ని అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X