‘మహేశ్ బాబు సినిమాను ఆ రకంగా తొక్కేశారు.. భారీగా నష్టపోయాం’

సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు రీజినల్ లోనే సత్తా చాటారు. స్టార్ డైరెక్టర్లు, స్టార్ ప్రొడ్యూసర్లతో కలిసి పనిచేశారు. ఆయన కెరీయర్ లోనూ పలు ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించారు. సోషల్ మెసేజ్ ఉండేలానూ తన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇలా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. పవన్ కళ్యాణ్ తర్వాత అంతటి ఫ్యాన్ బేస్ ఉన్నది మహేశ్ బాబు కే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు... అలాంటి మహేశ్ బాబు సినిమానే ఒక సమయంలో తొక్కేయడానికి చూశారంట. ఆ సినిమా వల్ల నష్టపోయానని కూడా టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ చెప్పడం హాట్ టాపిక్ గ్గా మారింది. ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తెలుగు ఫిల్మీబీట్ ఛానెల్‌లో కార్తీక్‌తో ఆయన మాట్లాడుతూ..

అది మహేశ్ బాబు కెరీయర్ లోనే ఉత్తమమైన చిత్రం..
సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీయర్ లో 'భరత్ అనే చిత్రం' ఉత్తమ చిత్రంగా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వం వహించారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై డీవీవీ దానయ్య రూ.65 కోట్లతో నిర్మించారు. 2018 ఏప్రిల్ 20న విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.225 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసింది. బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ మహేశ్ బాబు సరసన నటించింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం ఇచ్చారు. ఇక ఈ చిత్రం 2025 ఏప్రిల్ 19న రీరిలీజ్ అయ్యింది.

Producer Natti Kumar has said that some have deliberately financially damaged Mahesh Babu s film

మహేశ్ బాబు సినిమాను తొక్కేశారా?
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రేండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే మే30న మహేశ్ బాబు ఖలేజా చిత్రం రీరిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద రూ.16 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అయితే మహేశ్ బాబు సినిమాను తొక్కేసే ప్రయత్నం జరిగిందని, తను రీరిలీజ్ చేసిన సినిమాను ఆర్థికంగా నష్టపోయేలా చేశారని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ చెప్పుకొచ్చారు.

భరత్ అనే నేను చిత్రంతో నష్టం..
నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ.. '3 అనే సినిమాతో రీరిలీజ్ ల ట్రెండ్ ను ప్రారంభించింది నేనే. అది కేవలం ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, సింగిల్ థియేటర్లకు లాభం చేకూరాలని ప్రారంభించాం. రీసెంట్ గా ఖలేజా సినిమా రీ రిలీజ్ అయ్యి రూ.12 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రం సరిగ్గా కొత్త సినిమాలు ఉన్న సమయంలోనే విడుదలైంది. రీరిలీజ్ లను ఆదివారం గానీ, సోమవారం గానీ పెట్టుకుంటే బెటర్, లేదంటే కొత్త సినిమాల నిర్మాతలు నష్టపోయే ప్రమాదం ఉంది.

ఇక నేను కూడా మహేశ్ బాబు భరత్ అనే నేను చిత్రాన్ని రీరిలీజ్ చేసి నష్టపోయా.. నా మీద ఉన్న కోపంతోనే బడా ప్రొడ్యూసర్లు సినిమాను ఆడనివ్వకుండా చేశారు, ఇది ఫ్యాన్స్ కూడా గమనించాలి, వందల కోట్ల సినిమాల్లో వాళ్లే ఉంటున్నారు.. చిన్న సినిమాల్లోనూ వాళ్లే ఉంటున్నారని' నట్టి కుమార్ చెప్పుకొచ్చారు. రీరిలీజ్ ల విషయంలో కొత్త సినిమాలకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. మరోవైపు డిస్ట్రిబ్యూటర్లను, చిన్న నిర్మాతలకు సపోర్ట్ చేయాలని కోరారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X