‘ఆదిపురుష్‌కు 6 షోలకు అనుమతా? సీఎం జగన్, కేసీఆర్ కాళ్లు పట్టుకొంటా.. సర్వనాశనం అవుతున్నాం’

చిన్న చిత్రాలకు, నిర్మాతలకు ప్రోత్సాహం అందించాలని నిర్మాత నట్టి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా మేము విన్నవించుకొన్న ఫలితం దక్కలేదని అన్నారు. ఆదిపురుష్ సినిమాకు ఆరు షోలకు అనుమతి ఇచ్చారు. కానీ చిన్న నిర్మాతకు సహకారం అందించడం లేదన్నారు. తాజాగా హైదరాబాద్‌లో నట్టి కుమార్ మీడియాతో మాట్లాడుతూ..

చిన్న సినిమాను బతికించాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. గతంలో చంద్రబాబు, ప్రస్తుతం వైఎస్ జగన్ ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేశాం. తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా పలు మార్లు దరఖాస్తు చేసుకొన్నాం. చిన్న సినిమాకు చచ్చిపోతున్నది. మధ్యాహ్నం రెండున్నర షోకు అనుమతి ఇవ్వాలని పలుమార్లు కోరాం అని నిర్మాత నట్టి కుమార్ అన్నారు.

చిన్న నిర్మాత బతుకు బస్టాండ్ అవుతున్నది. చిన్న సినిమాలకు ఒక ఆట కేటాయించాలని మొరపెట్టుకొంటున్నాం. చిన్న సినిమాను రెండున్నరకు ఒక షో వేయాలని జీవో ఇవ్వాలి. మా నిర్మాతల తరఫు నుంచి ముఖ్యమంత్రుల కాళ్లు పట్టుకొంటాను. చిన్న నిర్మాతలు సర్వనాశనం అవుతున్నారు. పూర్తిగా దెబ్బ తినిపోయారు అని నట్టి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. గత నాలుగేళ్లలో ఏమీ చేయలేదు. ఐదో సంవత్సరం కూడా ముగిసిపోనున్నది. రెండు దఫాలు ప్రభుత్వాల కాలపరిమితి ముగిసిపోనున్నది. చిన్న నిర్మాతకు ఎలాంటి సహాయం అందలేదు. సీఎం జగన్, సీఎం కేసీఆర్‌ను రిక్వెస్ట్ చేస్తున్నాను. మాకు ఐదో షోకు అనుమతి ఇవ్వాలి అన్నారు.

Producer Natti Kumar pot shot on YS Jagan and K Chandra Sekhar Rao over support for Small budget movies

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దయచేసి చేతులు జోడించి మొక్కుతున్నాను. చిన్న సినిమా బతకాలంటే.. ఐదో షో తప్పకుండా ఉండాలి. చిన్న సినిమాలు ఆడితేనే కార్మికులు జీవితం ఉంటుంది. మా పరిస్థితిని అర్ధం చేసుకోవాలని వేడుకొంటున్నాను అని నిర్మాత నట్టి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదిపురుష్‌కు ఆరు షోలు ప్రదర్శించడానికి మూడు రోజుల్లో నిర్ణయం తీసుకొన్నారు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. మాకు న్యాయం చేస్తారని ముఖ్యమంత్రులను వేడుకొంటున్నాను అని నట్టి కుమార్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X