twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్యను ఎందుకు పిలువలేదు.. ఇండస్ట్రీని విభజించి పాలించకండి.. చిరంజీవిపై నట్టి కుమార్ ఘాటైన వ్యాఖ్యలు

    |

    తెలుగు సినీ పరిశ్రమలోని సమస్యలను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చించడానికి చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖులు సమావేశం కావడంపై చిన్న సినిమాల నిర్మాతల సంఘం ప్రతినిధి ప్రొడ్యూసర్ నట్టి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 16న కొందరితో మాత్రమే చిరంజీవి భేటీ కావడంపై నట్టి కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. మంగళవారం (ఆగస్టు 17వ) రోజున హైదరాబాద్‌లో నిర్మాత నట్టి కుమార్ ప్రెస్‌ మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలను ఇండస్ట్రీకి సంబంధించిన కొందరే చర్చించుకోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న కొందరికి విమర్శనాస్త్రాలు సంధించే అవకాశం దక్కింది. ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలితో చర్చలు జరపకుండా ఏక పక్ష నిర్ణయాలు తీసుకొంటారా అంటూ కొందరు అప్పడే గుసగుసలాడుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో నట్టి కుమార్ ప్రెస్ మీట్ పెట్టి ఘాటుగా స్పందించారు. చిరంజీవికి చిన్న నిర్మాతలు గుర్తున్నారా? లేరా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నట్టి కుమార్ ఏం మాట్లాడారంటే...

    Bigg boss 5 Telugu: కంటెస్టెంట్ గా రానున్న TV9 యాంకర్ ప్రత్యూష.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్Bigg boss 5 Telugu: కంటెస్టెంట్ గా రానున్న TV9 యాంకర్ ప్రత్యూష.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

     టికెట్ రేట్లు పెంచడం వల్లే

    టికెట్ రేట్లు పెంచడం వల్లే

    ఏపీలోని అన్ని ప్రాంతాల్లోని టికెట్ రేట్స్‌ విషయంలో సర్కారు సానుకూలంగా స్పందించాలి. ఏ సెంటర్లలో సినిమా టికెట్ 100 రూపాయలు, బీ, సీ సెంటర్లలో టికెట్ రేటును 30 నుంచి 50 రూపాయలకు చెయ్యాలి అని డిమాండ్ చేశారు. థియేటర్లలో టికెట్ రేట్ రూ.100 ఉండటం వల్లే తిమ్మరుసు, SR కల్యాణమండపం సినిమాలు మంచి కలెక్షన్లు సాధించాయి. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 35ను రద్దు చేయొద్దు అంటూ నట్టి కుమార్ తెలిపారు.

    Shruti Haasan హాట్ హాట్‌గా.. ముంబైలో బ్యూటీ ఇల్లు చూస్తే కళ్లు తిరగాల్సిందే!Shruti Haasan హాట్ హాట్‌గా.. ముంబైలో బ్యూటీ ఇల్లు చూస్తే కళ్లు తిరగాల్సిందే!

    ఏపీ ప్రభుత్వ హామీలు నెరవేరలేదు

    ఏపీ ప్రభుత్వ హామీలు నెరవేరలేదు

    కరోనా సమయంలో థియేటర్స్‌కు 3 నెలలు కరెంట్ బిల్లు సబ్సీడిగా ఇస్తామని ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఆ హామీ ఇప్పటి వరకు అమలు కాలేదు. ఏపీలో జీవో 35 అమలు కావడం లేదు. జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వోలతో సంప్రదించినా ప్రయోజనం లేకుండా పోయింది అంటూ నట్టి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న నిర్మాతలకు తగిన ప్రోత్సాహం ఇవ్వడం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలో చిన్న నిర్మాతలకు ప్రోత్సాహం అందిస్తామని చెబుతున్నారు. చిన్న సినిమాకు 5వ షో వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అది సాధ్యం కాలేదు అని నట్టి కుమార్ అన్నారు.

    సురేష్ బాబుపై నట్టి కుమార్ సెటైర్లు

    సురేష్ బాబుపై నట్టి కుమార్ సెటైర్లు

    థియేటర్లలో వెసులుబాటు లేకపోవడంతో పెద్ద నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. దాంతో థియేటర్లకు అన్యాయం జరుగుతున్నది. స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు తమ బ్యానర్‌లో నిర్మించిన నారప్ప సినిమాను ఓటీటీలో విడుదల చేశారు. థియేటర్ల వల్లే తాము పెద్ద వాళ్లం అయ్యాం, మాకు ఇంతమంది అభిమానులు ఏర్పడ్డారు. ఇంత ఇమేజ్ వచ్చిందని చెప్పుకొన్న సినీ పెద్దలు ఆ విషయాన్ని మరచిపోకూడదు అంటూ నట్టి కుమార్ కామెంట్స్ చేశారు.

    చిరంజీవి అంటే నమ్మకం అంటూ...

    చిరంజీవి అంటే నమ్మకం అంటూ...

    చిరంజీవి అంటే నమ్మకం, గౌరవం ఉంది. కానీ దయచేసి ఇండస్ట్రీని విభజించి పాలించకండి అని నట్టి కుమార్ అన్నారు. చిరంజీవికి చిన్న సినిమా నిర్మాతలు గుర్తున్నారా. చిరంజీవి గారు ఫిల్మ్ ఇండస్ట్రీ. .అంటే మా అసోసియేషన్ కాదు, 24 శాఖలు ఉంటాయని గ్రహించాలి అంటూ ప్రశ్నించారు. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలను చర్చించడానికి ఏపీ సీఎం జగన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌ను, ఫిల్మ్ ఛాంబర్‌ను ఆహ్వానించకుండా, వ్యక్తిగతం సినీ ప్రముఖులను ఎందుకు పిలుస్తున్నారో అర్దం కావడం లేదు అని నట్టి కుమార్ ప్రశ్నించారు.

    చిరంజీవి అందరివాడిగా ముందుకెళ్లాలి

    చిరంజీవి అందరివాడిగా ముందుకెళ్లాలి

    ఆగస్టు 16వ తేదీన సినీ పరిశ్రమ సమస్యలను చర్చించడానికి హీరో బాలకృష్ణను, నిర్మాతల మండలి వైస్ ప్రెసిడెంట్, కార్యదర్శిని ఎందుకు పిలవలేదు. చిరంజీవి నిర్వహించిన సమావేశంలో పెద్ద నిర్మాతలు తప్ప.. చిన్న నిర్మాతలు కనిపించలేదు. సినిమా పరిశ్రమలోని చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరిని కలుపుకొని పోవాలి. సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా దాసరి గారి తర్వాత చిరంజీవి గారిని మేము గౌరవిస్తాం. అయితే ఈ విషయాలన్నిటిని ఆయన దృష్టిలో పెట్టుకుని చిరంజీవి గారు అందరివాడిగా ముందుకు సాగాలి అని నట్టి కుమార్ సూచించారు.

    ఏపీ సర్కార్ హామీలు నెరవేరడం లేదంటూ..

    ఏపీ సర్కార్ హామీలు నెరవేరడం లేదంటూ..

    గతంలో చిరంజీవి, నాగార్జున దితరులు అందరూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలిశారు. ఆ సమావేశంలో ఏపీ సర్కార్ ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేరలేదు. సమావేశానికి వెళ్లిన వారు ఆ హామీలను ఎంతవరకు ఫాలో అప్ చేశారని నట్టి కుమార్ తాజా ప్రెస్‌మీట్‌లో అడిగారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన 35 జీవోతోపాటు ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు అంటూ నట్టి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

    సినీ పరిశ్రమ పెద్దలను టార్గెట్ చేసుకొని నిర్మాత నట్టి కుమార్ వ్యాఖ్యల వెనుక ఎవరి హస్తమైనా ఉందా అనే కోణంలో చర్చ మొదలైంది. నట్టి కుమార్ స్వయంగా స్పందించారా? లేక ఇండస్ట్రీలోని వేరే వర్గం నట్టికి ఉందా? ఉంటే ఆ వర్గం ఎవరనే విషయం ఇప్పుడు సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది.

    English summary
    Producer Natti Kumar Potshots on Mega star Chirajneevi and star producer Suresh Babu amid Meeting with CM YS Jaganmohan Reddy. He questioned that Why Balakrishna was not invited to meeting.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X