Dil Rajuకు Natti Kumar సవాల్.. తప్పని నిరూపిస్తే క్షమాపణలు చెబుతానంటూ..

తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు వినోదం అందించే సినీ ఇండస్ట్రీలో రాజకీయాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. ఆ మధ్యలో మా(MAA) ఎలక్షన్స్ ఎంతగా హాట్ టాపిక్ అయ్యాయో తెలిసిన విషయమే. విమర్శలు, ప్రతివిమర్శల నడుమ సాగాయి. అయితే ఇప్పుడు మరోసారి ఇండస్ట్రీలో ఎన్నికల వేడి తగలనుంది.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల హడావిడి మొదలైపోయింది. మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనుంది. ఈ క్రమంలో తాజాగా ఎన్నికల బరిలోకి దిగిన ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై నట్టికుమార్ విమర్శలు కురిపించారు. కొన్ని ప్రశ్నలను సంధిస్తూ సవాల్ విసిరారు. వివరాళ్లోకి వెళితే..

Producer Natti Kumar Sensational Comments on Producer Dill Raju About MAA Elections goes Viral

సందడి మొదలు: తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల సందడి మొదలైపోయింది. ఈ నెల 14న నామినేషన్స్‌ పూర్తి కాగా.. 21వ తేదీతో నామినేషన్‌ విత్‌ డ్రా గడువు పూర్తైంది. ఇక ఈ నెల 30న ఎన్నికలు జరిగేందుకు అంతా సిద్ధమైంది. ఇందులో భాగంగా తెలుగు నిర్మాతల సెక్టార్‌, డిస్రిబ్యూటర్ సెక్టార్‌, స్టూడియో సెక్టార్‌కు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎగ్జిబిటర్‌ సెక్టార్‌కు ఎన్నిక ఇప్పటికే ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే.

Producer Natti Kumar Sensational Comments on Producer Dill Raju About MAA Elections goes Viral

ఎన్నికలు వేడివాడిగా: ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవి బరిలో ప్రధానంగా నిర్మాతలు సి. కల్యాణ్, దిల్ రాజు పేర్లు కీలకంగా మారాయి. అయితే సి. కల్యాణ్ ఇప్పటికే టాలీవుడ్ లో ఎన్నో శాఖల్లో కీలక పదువుల్లో కొనసాగి సేవలందించారు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక తెలుగు చిత్రసీమలోని ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు.. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరు బరిలోకి దిగడంతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు వాడివేడీగా సాగనున్నాయి.

దిల్ రాజుపై ప్రశ్నల వర్షం: తాజాగా నిర్మాత నట్టికుమార్ ఓ వీడియో బైట్ ను రిలీజ్ చేశారు. ఎన్నికల బరిలోకి దిగిన దిల్ రాజుపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ సవాల్ విసిరారు. ఆయన మాట్లాడుతూ.. "ఈ నెల 30న ఎన్నికలు జరుగుతున్నాయి. సి కల్యాణ్ దిల్ రాజు ప్యానెల్ పోటీపడుతున్నాయి. పోటీలో భాగంగా ఓ ప్రెస్ మీట్ పెట్టి దిల్ రాజు చెప్పిన కార్యక్రమాలు అన్నీ బాగున్నాయి. కానీ తెలుసుకోవాలి ఏంటంటే.. ఆచరణలో అవేమీ లేవని. 14 మంది వరకు గెలిచారు. కానీ వారెవరు ఇప్పటివరకు కౌన్సిల్ లోకి అడుగుపెట్టలేదు. కానీ మెడీ క్లైమ్ చేశామని చెప్పారు.

అది ఎలా సాధ్యమైందో చెబితే దాన్ని మేము కూడా ఆచరణలో పెడతాం. మీరు గిల్డ్ నుంచి రూపాయి ఇవ్వలేదు. గిల్డ్ నుంచి వచ్చే ఆదాయం మీ గిల్డ్ లోని 21 మందికే వెళ్తుంది. కౌన్సిల్ కు ఒక్క రూపాయి కూడా రాలేదు. మెడి క్లైమ్ సరిగ్గా జరగట్లేదని ఫిర్యాదులు భారీగా వస్తున్నాయి. గిల్డ్ సంక్షేమ పథకాలు ఏమీ చేయట్లేదు. ఇవన్నీ బయట వినిపిస్తున్నాయి." అని నట్టికుమార్ పేర్కొన్నారు.

Producer Natti Kumar Sensational Comments on Producer Dill Raju About MAA Elections goes Viral

తప్పని నిరూపిస్తే క్షమాపణలు: "నాలుగు సంవత్సరాలు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇచ్చిన హామీలు ఏమీ చేయలేదు. కానీ ఎన్నికలు వచ్చేసరికి అన్ని సాధించినట్లు చెబుతున్నారు. నాలుగు సంవత్సరాలలో ఏమీ సాధించలేనిది... మరో రెండు సంవత్సరాల్లో ఎలా సాధిస్తారో?. మెంబర్ కు కష్టం వచ్చినప్పుడు ఎవరూ ఆదుకోలేదు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వ్చచిన ఏమీ చేయలేదు. ఎవరూ అండగా నిలవలేదు. మెడి క్లైమ్ లోనూ అదే జరిగింది. నేను చెప్పినవన్నీ మీరు తప్పని నిరూపిస్తే క్షమాపణలు చెబుతాను" అని నట్టికుమార్ అన్నారు.

విషయ పరిజ్ఞానం లేదు: "వ్యక్తిగతంగా నాకు మీపై ఎటువంటి కోపం లేదు. మీరు మంచి వారు. కానీ మీకున్న బిజీ షెడ్యూల్ వల్ల అన్నీ మీరు చూసుకోలేకపోతున్నారు. మీ మెంబర్స్ చెప్పినవే వింటున్నారు. నేను ఏం చెబుతున్నానంటే.. దిల్ రాజు మీకు విషయ పరిజ్ఞానం లేదు. మీకు ఏమీ తెలీదు. పదవిలో ఉన్నని రోజులు మీరు ఏం సాధించారో ఏం అభివృద్ధి చేశారో అందరూ కూర్చొని చర్చిద్దాం.

ఇప్పుడు నేను చెప్పినవన్నీ తప్పని నిరూపించగలరా? అయినా ఇప్పటివరకు జరిగిన పరిణామాలన్నింటినీ దృష్టిల్లోకి తీసుకుని ఇప్పటికే ఓటర్లు అందరూ ఎవరికి ఓటు వేయాలనే దానిపై ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఓటర్లందరూ ఆలోచించి ఓటు వేయండి. ఇదే మనవి" అని నట్టి కుమార్ మాట్లాడుతూ దిల్ రాజుకు సవాల్ విసిరారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X