twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Acharya Pre Release Event: ఇండస్ట్రీ బ్రతికింది ఆయన వల్లే.. సవాల్ విసురుతున్నా: ఎన్వీ ప్రసాద్

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మెగాస్టార్ చిరంజీవి మొదటి సారి కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఆచార్య సినిమా ఈనెల 29న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మెగా ప్రొడక్షన్ కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు దర్శక ధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథిగా వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి తో వర్క్ చేస్తున్న మరికొంత మంది దర్శకులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాను నిర్మిస్తున్న ఎన్వీ ప్రసాద్ కూడా ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇక ఆయన తనదైన శైలిలో మాట్లాడారు.

    ప్రొడ్యూసర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చిన మెగా అభిమానులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఆచార్య సినిమా తర్వాత మా సినిమా గాడ్ ఫాదర్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సమయంలో పెద్ద బాస్ చిరంజీవి గారి గురించి ఇంకా ఎక్కువ గా చెబుతాను. నేను వర్క్ చేసిన చిరంజీవి గారి గురించి అలాగే ఒకప్పుడు నేను ఎత్తుకున్న చరణ్ గురించి నా సినిమా వేడుకలో ఇంకా చాలా విషయాలు చెబుతాను. ఈ సినిమా ఇండస్ట్రీ కోసం ఆచార్య సినిమాని ఎంత త్యాగం చేశారో చిరంజీవిగారి ఒక్కరికి మాత్రమే తెలుసు.

    Producer NV Prasad speech in Acharya Pre Release Event

    ఎందుకంటే RRR లాంటి గొప్ప పాన్ ఇండియా సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది అంటే ఆ సినిమా కోసం విడుదల తేదీని త్యాగం చేశారు. ప్రపంచం మొత్తం మాట్లాడుకునే విధంగా మన తెలుగు ఇండస్ట్రీ నిలబడుతుంది అని నేను ఎప్పుడో చెప్పాను. అది ఇప్పుడు రాజమౌళి గారితో సాధ్యమైంది. ఆయన నిరూపించారు. RRR సినిమా కోసం రాజమౌళి గారు అలాగే నిర్మాత దానయ్య గారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. హీరోలు ఇద్దరు కూడా అర్ధరాత్రి కూడా షూటింగ్ లో చాలా కష్టపడ్డారు. అలాంటి సినిమా ఉగాది సమయంలో రావాలంటే ఆచార్య సినిమా వాయిదా పడాలని కోరుకున్నప్పుడు అందుకు మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు కొరటాల శివ గారు నిర్మాత నిరంజన్ రెడ్డి గారు కూడా ఎంతగానో సహకరించారు.

    ఇండస్ట్రీ సమస్యలన్నీ తన బాధ్యతగా తీసుకొని ఎంతగానో సహకరించినటువంటి ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే. ఎవరో ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ఇండస్ట్రీ బ్రతికింది అంటే మెగాస్టార్ చిరంజీవి గారి వల్లే బ్రతికింది. ఎవరైనా సరే సవాల్ విసురుతున్నా.. నా దగ్గరికి వచ్చి మాట్లాడండి. ఏదో బయట వచ్చే సోషల్ మీడియాలో మాట్లాడేది కాదు. నా సినిమా రోజు ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడతాను. ఇక ఈ పాండమిక్ లో ఎంత స్ట్రగుల్ అవుతూ వచ్చినా RRR కేజిఎఫ్ ఆచార్య సినిమాలు సక్సెస్ అయితే ఇండస్ట్రీ మళ్లీ మరింత ఉన్నత స్థాయికి వెళుతుంది అని అనిపించింది. ఇక మిగిలిన ఆచార్య సినిమా మంచి విజయం సాధించాలని ఇక రాబోయే గాడ్ ఫాదర్ సినిమా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. అని ప్రసాద్ వివరణ ఇచ్చారు

    English summary
    Producer NV Prasad speech in Acharya Pre Release Event
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X