టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఇంట్లో తీవ్ర విషాదం..
ఓ వైవు కరోనాతో సతమతమవుతున్న తరుణంలో సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాధాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక ఘటన గురించి మరవకముందే మరొక విషాద ఘటన చోటు చేసుకుంటోంది. ఇక రీసెంట్ గా ఒక ప్రముఖ నిర్మాత ఇంట్లో చోటుచేసుకున్న ఘటన అందరిని షాక్ కి గురి చేసింది.
త్రివిక్రమ్ సినిమాలకు ఎక్కువగా వర్క్ చేసిన ఎగ్జిక్యూటివ్ నిర్మాత పి.డి.వి. ప్రసాద్ భార్య అంజు ప్రసాద్ ఈ రోజు గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో ఒక్కసారిగా సినీ ప్రముఖులులను ఈ వార్త కలచివేసింది. సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. 53 ఏళ్ళ వయసుతో ఉన్న ఆమె ఇటీవల కొంత అనారోగ్యంతో ఉండడంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.

కొలుకుంటున్నారని అనుకుంటున్న తరుణంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో కన్నుమూశారు. పీడీవీ ప్రసాద్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పి.డి.వి. ప్రసాద్ ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు హారిక హాసిని నిర్మించే చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారనే విషయం విదితమే. ఆమె చివరి అంత్యక్రియలు రేపు హైదరాబాద్‌లో జరుగుతాయని కుటుంబసభ్యులు తెలియజేశారు


Click it and Unblock the Notifications